ఆ రైతులకు ఇక నుంచి.. రైతు బంధు కోత పెడతాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్

-

గంజాయి, మత్తు పదార్థాలు సాగుచేస్తున్న , రవాణా వారిపై ఉక్కుపాదం మోపాలని అధికారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. గంజాయి సాగు చేస్తున్న రైతుల, పండిస్తున్న భూముల వివరాలను సేకరించి రైతుబంధు డబ్బులు రాకుండా వ్యవసాయ శాఖ అధికారులచే ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. ఎక్సైజ్, పోలీస్ శాఖ ల అధికారులు సమన్వయంతో గంజాయి రవాణా చేస్తున్న వారిపై, అనుమానితులపై నిఘా ఉంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

గంజాయి రవాణా చేస్తున్న సాగుచేస్తున్న వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి బైండోవర్ చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.విద్యాసంస్థల్లో మత్తు పదార్థాలకు అలవాటు పడిన విద్యార్థులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు , విద్యాసంస్థల నిర్వాహకులకు ఆబ్కారీ శాఖ, పోలీస్ శాఖల అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలని మంత్రి సూచించారు.

గంజాయి సాగుచేస్తున్నా, రవాణా చేస్తున్న వారిపై, అందుకు సహకారాన్ని అందించే ఎంతటి వారైనా వారిని చట్టరీత్యా కేసులు నమోదు చేసిన అధికారులకు ప్రభుత్వం తరపున అవార్డుల ను అందించి ప్రోత్సహించడం జరుగుతుందన్నారుగ్రామాల్లో గంజాయి సాగు చేస్తున్నా వారిని యువకులు, ప్రజాప్రతినిధులు సామాజిక బాధ్యతగా భావించి ఆబ్కారీ, పోలీస్ శాఖ ల అధికారులకు సమాచారం అందించాలని గౌడ్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news