భార్యకు తన మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలని నడి రోడ్డు మీద.. వీడియో

-

ఫుల్లుగా తాగాడు. ఏం చేస్తున్నాడో తెలియదు. తాగాక మనిషి మనిషిలా ఉండడు కదా. రోడ్డు మీదికి వచ్చాడు. నడిరోడ్డు మీద నిలబడపోయాడు. అతడి వైఫ్.. మనోడి పరిస్థితిని అర్థం చేసుకొని రోడ్డు నుంచి పక్కకు లాగింది. కానీ.. లోపల ఉన్న మందు ఊరుకుంటుందా? ఊహూం.. నీకు నామీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకుటా ఇప్పుడు.. అని మళ్లీ వెళ్లి నడిరోడ్డు మీద నిలబడ్డాడు. అప్పటికే కొన్ని వాహనాలు నడిరోడ్డు మీద నిలబడి ఆ వ్యక్తిని చూసి టర్న్ చేసుకొని మరీ వెళ్లాయి.

Love test ends badly after man is hit by car in front of his wife

కానీ.. ఓ వ్యాన్ మాత్రం వేగంగా దూసుకొస్తుంది. అయినా మనోడు అలాగే నిలబడ్డాడు. అది వేగంగా వచ్చి అతడిని ఢీకొడుతూ వెళ్లింది. అంతే.. మనోడు ఎగిరి ఎక్కడో పడ్డాడు. వెంటనే అతడి భార్య పరిగెత్తుకుంటూ వెళ్లి తీవ్రంగా గాయపడిన తన భర్తను ఆసుపత్రికి తీసుకెళ్లింది. ముఖం మీద, చాతి మీద తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే ఉందట. ఈ ఘటన చైనాలో జరిగింది. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news