మనం మాట్లాడుకునేది రిలయెన్స్ జియో గురించి. మహేశ్ బాబు గురించి అనుకునేరు. జియో గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది. టెలికాం రంగంలో అదో సంచలనం. మిగితా నెట్‌వర్క్‌లన్నీ దాని దెబ్బకు కుదేలయ్యాయి. అప్పటి వరకు టెలికాం రంగంలో అగ్రగామిగా ఉన్న ఎయిర్‌టెల్ కూడా దాని దెబ్బకు ఇంకా కోలుకోలేకపోయింది. ఇక.. జియో ప్రకటించే ఆఫర్లు కానీ… డేటా కానీ.. డేటా స్పీడ్ కానీ.. అన్నింట్లో అది అగ్రగామిగానే నిలిచింది.
ఫిబ్రవరి నెలలోనూ జియో ఫుల్ ఫాస్ట్ టెలికామ్‌గా మొదటి స్థానంలో నిలిచింది. జియో నుంచి సగటు డౌన్‌లోడ్ వేగం సెకనుకు 20.9 ఎంబీగా నమోదైందట. ఈ విషయాలను ట్రాయ్ వెల్లడించింది. అదే ఫిబ్రవరి నెలలో ఎయిర్‌టెల్, వొడాఫోన్ డౌన్‌లోడ్ వేగం సెకనుకు 9.4 ఎంబీ, 6.8 ఎంబీగా నమోదైందట. ఐడియా వేగం 5.7 ఎంబీపీఎస్‌గా నమోదైందట. అంటే జియో, ఎయిర్‌టెల్ డౌన్‌లోడ్ వేగాన్ని పోల్చితే.. ఎయిర్‌టెల్ కన్నా జియో రెట్టింపు స్పీడ్‌తో డౌన్‌లోడ్ వేగాన్ని కలిగి ఉంది. దీంతో ఫిబ్రవరిలో జియో డౌన్‌లోడ్ స్పీడ్‌లో టాప్‌లో నిలిచినట్లు ట్రాయ్ వెల్లడించింది.
అప్‌లోడ్ విషయానికి వస్తే మాత్రం వొడాఫోన్ 6.0 ఎంబీపీఎస్‌తో మొదటి స్థానంలో నిలవగా.. ఐడియా 5.6 ఎంబీపీఎస్‌తో రెండో స్థానం, జియో 4.5 ఎంబీపీఎస్‌తో మూడో స్థానంలో నిలిచింది. ఎయిర్‌టెల్ 3.7 ఎంబీపీఎస్‌తో చివరి స్థానం దక్కించుకుంది. అప్‌లోడ్‌లో జియో అదే మూడో స్థానంలో ఉండటంతో ఈసారి మరికొన్ని మార్పులు చేసి అప్‌లోడ్‌లోనూ టాప్ పొజిషన్‌లో నిలవడానికి జియో ప్రయత్నాలు చేస్తోంది.