ఖరీదైన కార్లు, 10 కుటుంబాలు వచ్చినా పడుకోవడానికి సరిపోయే ఇల్లు.. 56 ఇంచుల టీవీ, ఇంటిముందు 100 గజాల పూల తోట.. ప్రపంచంలో ఉన్న లగ్జరీస్ అన్ని ఇంట్లో దొరికితే అలాంటి లైఫ్ ని ఎవరూ కాదనలేరు.
చాలామందికి ఖరీదైన బ్రతుకు బ్రతకాలని ఉంటుంది. కొందరు మాత్రమే సింపుల్ గా జీవించాలని అనుకుంటారు. అలా జీవించాలనుకునే వారి ప్రధాన సూత్రం లెస్ ఇస్ మోర్.
తక్కువే ఎక్కువ అన్న కాన్సెప్ట్ తో బ్రతకడం ట్రెండ్ గా మారిపోయింది. ఇలాంటి కాన్సెప్ట్ ని మినిమలిజం అంటారు. అసలు ఇలా ఎందుకు బతుకుతారు..? దీనివల్ల లాభం ఏంటని మీకు అనిపించవచ్చు. ఎప్పుడైతే మనిషి దగ్గర ఉండాల్సినవన్నీ తక్కువగా ఉంటాయో అప్పుడే మనశ్శాంతి, స్వేచ్ఛ, ఒక స్పష్టత ఉంటుందని మినిమలిజం ఫాలో అయ్యే వారి భావన.
మీరు కూడా ఇలా బ్రతకాలి అనుకుంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
చిన్న గది, తక్కువ వస్తువులు:
కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే సుఖంగా నిద్రపోయేలా ఉన్న గదిలో చాలా తక్కువ వస్తువులు ఉంచుకోవాలి. మీకు ఏ వస్తువులు అవసరం అవుతాయో వాటిని మాత్రమే ఉంచండి. కొన్ని వస్తువులను మనం చాలా రోజులుగా వాడము. అయినా కూడా అవి మన గదుల్లో ఉంటాయి. వాటిని వెంటనే చెత్తబుట్టలోకి విసిరి వేయండి. మీ చుట్టూ మీరు రెగ్యులర్ గా వాడే వస్తువులను మాత్రమే ఉంచండి.
చవకబారు వస్తువులు కొనవద్దు:
తక్కువకు వస్తున్నాయి కదా అని నచ్చిన ప్రతీ వస్తువును తెచ్చి రూమ్ లో పెట్టకండి. అది కొన్ని రోజులు బాగుంటుంది తర్వాత పాడైపోతుంది. అలా కాకుండా ఎక్కువ రోజులు ఉపయోగపడే వస్తువులను మీ గదిలో ఉంచండి.
స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించండి:
సింపుల్ గా బతకాలి అనుకునేది ప్రశాంతత కోసం కాబట్టి స్మార్ట్ ఫోన్ కి దూరంగా ఉండాలి. ప్రపంచంలో ఉన్న దరిద్రమంతా ఫోన్ లోనే కనిపిస్తుంది. ఆ దరిద్రం మీకు అంటకుండా ఉండాలంటే.. రోజులో చాలా తక్కువ సమయం మాత్రమే స్మార్ట్ ఫోన్ వాడండి.
వస్తువుల మీద కాకుండా అనుభవాల మీద దృష్టి పెట్టండి:
ఎప్పుడు ఏ వస్తువు కొందామని కాకుండా ఎప్పుడు ఎలాంటి అనుభవం పొందుదామనే దానిమీద టైం స్పెండ్ చేయండి. ట్రావెల్ చేయండి, ఏదైనా కొత్త కోర్సు నేర్చుకోండి.