‘గని’ మూవీ రిలీజ్ డేట్స్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

-

కరోనా థర్డ్ వేవ్ నుంచి చిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. డిసెంబర్, జనవరి నెలల్లో దేశంలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువ కావడంతో దాదాపు సినిమా రిలీజ్ లు అడిపోయాయి. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో మళ్లీ ఒక్కొక్కటిగా రిలీజ్ డేట్లు ప్రకటిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ప్యాన్ ఇండియా మూవీ ట్రిపుల్ ఆర్ సినిమాతో పాటు ఆచార్య, భీమ్లా నాయక్ సినిమా డేట్లను ప్రకటించారు.

తాజాగా వరణ్ తేజ్ మూవీ ‘గనీ’ రిలీజ్ డేట్లను కూడా ప్రకటించారు మేకర్స్. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో వరణ్ తేజ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రం విడుదలపై క్లారిటీ ఇచ్చింది మూవీ యూనిట్. ఫిబ్రవరి  25 లేదా మార్చి 4న ఈ సినిమాను విడుదల చేస్తామని రెండు డేట్లు ప్రకటించారు. అయితే గతేడాది డిసెంబర్ లోనే రిలీజ్ కావాల్సిన గని మూవీ లాస్ట్ మినట్స్ లో వాయిదా పడింది. వరసగా క్రేజీ సినిమాల డేట్స్ ప్రకటిస్తుండటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరోల సినిమాలు ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news