U-19 World Cup : ఆసీస్ ను చిత్తు చేసిన కుర్రాళ్లు .. ఫైన‌ల్ కు చేరిన టీమిండియా

-

అండ‌ర్-19 ప్ర‌పంచ క‌ప్ లో యంగ్ టీమిండియా ఎనిమిదో సారి ఫైన‌ల్ కు చేరింది. ఆస్ట్రేలియా తో బుధ‌వారం జ‌రిగ‌న సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో భార‌త్ కుర్రాళ్లు రెచ్చిపోయారు. దీంతో ఆస్ట్రేలియా పై టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆదిలోనే ఓపెన‌ర్లు ర‌ఘువంశీ, హ‌ర్నూర్ సింగ్ స్వ‌ల్ప స్కోరుకే వెనుతిరిగారు. త‌ర్వాత బ్యాటింగ్ కు వ‌చ్చిన కెప్టెన్ యశ్ ధుల్ (110), వైస్ కెప్టెన్ ర‌షీద్ (94) ముందు నెమ్మ‌దిగా ఆడినా.. త‌ర్వాత దాటిగా ఆడి భార‌త్ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించారు.

వీరి వీరోచిత పోరాటంతో టీమిండియా నిర్ణ‌త 50 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు కోల్పోయి 290 ప‌రుగులు చేసింది. అనంత‌రం బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియాను రెండో ఓవ‌ర్ల‌నే వికెట్ ప‌డ‌గొట్టి షాక్ ఇచ్చారు. త‌ర్వాత కూడా ఆసీస్ ను ఎక్కుడ కొలుకోకుండా.. భార‌త్ బౌల‌ర్లు అడ్డుక‌ట్ట వేసి వికెట్లు తీసుకున్నారు. భార‌త బౌల‌ర్ల దాటికి ఆసీస్ బ్యాట్స్ మెన్స్ చేతులెత్తాశారు.

దీంతో 41.5 ఓవ‌ర్ల లో 190 పరుగుల వ‌ద్ద ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. భార‌త్ బౌల‌ర్లు రాజ‌వ‌ర్ధ‌న్, ర‌వి కుమార్, విక్కి త‌లో రెండు వికెట్లు తీశారు. రాజ్ బావ‌, ర‌ఘువంశీ, నిశాంత్ సింధు త‌లో ఒక వికెట్ తీశారు. అలాగే సెంచ‌రీతో ఆసీస్ పై విరుచుకుప‌డ్డ కెప్టెన్ య‌శ్ ధుల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది.

Read more RELATED
Recommended to you

Latest news