వాహనదారులకు అలర్ట్‌..హైదరాబాద్ ట్రాఫిక్ జంక్షన్లలో భారీ మార్పులు

-

హైదరాబాద్ ట్రాఫిక్ జంక్షన్లలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. పలు జంక్షన్ల వద్ద రాకపోకలపై త్వరలో ఆంక్షలు విధించేందుకు సిద్ధమౌవుతున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. రద్దీ జంక్షన్ల వద్ద ఫ్రీ లెఫ్ట్‌ను పెట్టే యోచనలో ఉన్నట్లు.. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, లంగర్‌హౌజ్, నానల్ నగర్..రవీంద్రభారతి, కంట్రోల్ రూమ్‌తోపాటు పలు జంక్షన్లలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ చెప్పారు.

మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు వాహనాలన్నింటినీ నేరుగా.. పంజాగుట్టకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఫిల్మ్‌నగర్ నుంచి రోడ్డు నెంబర్ 10 వైపు వెళ్లే వాహనాలన్నింటినీ..జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి ఫ్రీ లెప్ట్ ఇచ్చి మళ్లిస్తామని వెల్లడించారు.

ఇప్పటికే ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ఫ్రీలెప్ట్ సక్సెస్ అయిందని.. ఆర్టీసీ క్రాస్ రోడ్డు జంక్షన్ల మాదిరిగానే అన్నింటినీ తయారు చేసే యోచన ఉన్నట్లో స్పష్టం చేశారు. వాహనాలు జంక్షన్ల వద్ద నిలిచిపోకుండా ప్రణాళిక చేస్తున్నట్లు.. జంక్షన్ల వద్ద ట్రాఫిక్ రద్దీతో వాహనదారుల ఇక్కడ్లు పడుతున్నట్లు గుర్తించామన్నారు. రద్దీగా ఉండే జంక్షన్ల మార్పులపై ప్రణాళికలు సిద్ధం చేశామని.. వారం రోజుల్లో రద్దీ జంక్షన్ల వద్ద ట్రయల్స్ నిర్వహిస్తామని ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news