మేడారం జాతరకు, ఆర్టీసీ సంస్థకు అవినాభావ సంబంధం ఏర్పడిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. 1968 నుంచి మేడారం జాతరకు బస్సులను ప్రారంభించామని.. అప్పుడు వంద బస్సుల్ని ప్రారంభించామని అన్నారు. 1976లో 750 బస్సులను మేడారానికి నడపామని ఆయన అన్నారు. ప్రస్తుతం 3845 బస్సుల్ని నడిపిస్తామని వెల్లడించారు. గత మేడారంలో 19 లక్షల మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చామని అన్నారు. మేడారం జాతరను రెవెన్యూ జనరేట్ ప్రోగ్రామ్ గా కాకుండా సామాజిక సేవ, సామాజిక భాద్యతగా ఆర్టీసీ భావించిందని సజ్జనార్ అన్నారు. ఇప్పటికే 523 బస్సులను 1250 ట్రిప్పులు మేడారానికి నడిపామని వెల్లడించారు. మేడారంలో 50 ఎకరాల్లో బేస్ క్యాంపు, తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేసామని సజ్జనార్ వెల్లడించారు. మేడారం జాతర కోసం మేడారం విత్ టిఎస్ ఆర్టీసీ ప్రత్యేక యాప్ ను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చామని.. ఆర్టీసీ చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా యాప్ రూపొందించామని సజ్జనార్ వెల్లడించారు. వరంగల్ నుంచి 2 వేల బస్సుల్లో కండక్టర్ లేకుండా సర్వీసులు నడిపిస్తున్నామని ఆయన తెలిపారు.