పాఠశాల విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. పాఠశాలలో విద్యార్థులకు చదవడం అలవాటుగా ఉండాలని ప్రత్యేకంగా రీడ్ ( READ-ENJOY-DEVELOP) అనే కార్యక్రమానికి పూనుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని పాఠశాలలో ఈ రీడ్ కార్యక్రమాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ రీడ్ కార్యక్రమం ద్వారా పిల్లలు చదువుకోవడానికి ప్రత్యేకంగా ఒక పీరియడ్ ను కేటాయిస్తారు. ఈ పీరియడ్ లో విద్యార్థులు అందరూ కూడా చదవుకోవడానికి మాత్రమే సమయం కేటాయించేలా ఉపాధ్యాయులు చూడాలి.
ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ రీడ్ అనే కార్యక్రమాన్ని వర్తింప చేస్తారు. ఈ కార్యక్రమం 100 రోజుల పాటు ఉండనుంది. అయితే ఈ కార్యక్రామాన్ని నేటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయనున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ సంచాలకురాలు దేవసేన జారీ చేశారు. పాఠ్యా పుస్తకాలే కకుండా కథలు, న్యూస్ పేపర్స్ తో పాటు ఇతర పుస్తకాలను కూడా విధ్యార్థులకు ఇస్తారు. అలాగే ఈ రీడ్ కార్యక్రమం పై ఉపాధ్యాయులకు అవగాహన కూడా కల్పిస్తారు.