టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డే లో సొంత గడ్డపై 5 వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు విరాట్ కోహ్లీ. వెస్టిండీస్ తో నిన్న జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో 8 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ… ఐదు వేల పరుగుల మార్కును దాటాడు. తద్వారా ఈ రికార్డు నెలకొల్పిన నాలుగో బ్యాట్స్మన్గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
ఈ జాబితాలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. రన్నింగ్ మిషన్ సచిన్ టెండూల్కర్ 48 సగటుతో 6975 పరుగులు చేశాడు. ఆ తర్వాత రికీపాంటింగ్ 39 సగటుతో 5521 పరుగులు చేశారు. ఆటో దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ కలిసి 5180 ఆరు పరుగులు చేశాడు.
ఇక విరాట్ కోహ్లీ యావరేజ్ ప్రకారం (60.17) అగ్రస్థానంలో నిలిచాడు. ఇక సొంతగడ్డపై అత్యంత వేగంగా 5 వేల పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. గ్రాండ్ కోహ్లీ కేవలం 99 మ్యాచ్లోనే 5002 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.