సమాజంలో అసమానతలను తొలగించడానికి రామానుజాచార్యుల కృషి మరవనిదని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కాగ ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్.. హైదరాబాద్ లోని ముచ్చింతల్ లో గల సమతా మూర్తి రామానుజా చార్యుల సహస్రాబ్ధి ఉత్సవాల్లో పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో సమతా మూర్తి మండపానికి ఏపీ సీఎం జగన్ వచ్చారు. చిన్న జీయర్ స్వామి సమక్షంలో రామానుజా చార్యులను దర్శించుకున్నారు.
అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు సమతా మూర్తి రామానుజా చార్యులు స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు. సమాజంలో అసమానతలను తొలగించడానికి రామానుజా చార్యులు వెయ్యి సంవత్సరాల క్రితమే పోరాటం చేశారని అన్నారు. సమాజంలో అందరూ సమానులే అని చెప్పిన రామానుజా చార్యులు గొప్పవారని అన్నారు. అంతటి గొప్ప వ్యక్తి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. రామానుజాచార్యులకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తున్న చిన జీయర్ స్వామి అభినందనలు తెలిపారు.