బ్యూటీ స్పీక్స్ : బేబ‌మ్మ జ్వ‌రం ఇప్ప‌ట్లో త‌గ్గ‌దా?

-

సుస్వాగతం సినిమా స‌మ‌యంలో దేవ‌యాని ఎంతో క్రేజ్ తెచ్చుకున్నారు. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు ఓ హీరోయిన్ డెబ్యూ మూవీతోనే అంత‌టి క్రేజ్ తెచ్చుకోవడం ఆశ్చ‌ర్యం.సంభ్ర‌మాశ్చ‌ర్యం అని రాయాలి. పోలిక స‌రికాదో అవునో కానీ ఇప్పుడంతా అందాల బేబ‌మ్మ మానియాలోనే ఉన్నారు.

అందాల కృతిశెట్టిని ఇప్పుడంతా బేబ‌మ్మ అని పిలుస్తున్నారు. ఎన్ని సినిమాలు చేసినా కూడా ఆమె బేబ‌మ్మ‌గానే గుర్తుండిపోతారు. ఆమె చిన్న‌ప్పుడు ఫొటోలు మొద‌లుకుని ఇంకొన్ని జ్ఞాప‌కాలు ఫ్యాన్ మేడ్ ఎడిట్స్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

 

గ‌త కొంత కాలంగా అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకుపోతున్న బేబ‌మ్మ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి(హీరో సుధీర్ బాబు),మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం (హీరో నితిన్),ద వారియ‌ర్ (హీరో రామ్ పోతినేని) సినిమాల‌లో న‌టిస్తోంది.మొన్న‌నే ఆమె న‌టించిన శ్యామ్ సింగ‌రాయ్ సినిమా విడుద‌ల‌కు నోచుకుంది. ఆ సినిమాతో కూడా ఆమెకు మంచి పేరే వ‌చ్చింది. వ‌రుస అవ‌కాశాలు వ‌రుస అదృష్టాలు వ‌రుస భారీ భారీ చిత్రాలు అన్నీ క‌లిస్తే కృతి.అదృష్టానికి ఆకృతి.

ఉద‌యం వేళ‌ల్లో బేబ‌మ్మ ప్రెజెంట్ మిస్ అని అనుకుని కాలేజీకి వెళ్తుందో లేదో కానీ కుర్ర‌కారు క‌ల‌లోకి మాత్రం క్ర‌మం త‌ప్ప‌క అటెండెన్స్ వేయించుకుంటుంది. అందం ఒక్క‌టే ఆమెకు ప్ర‌స్తుతానికి ఆభ‌ర‌ణం. అభిన‌యం ఇంకా నేర్చుకోవాలి. ఉప్పెన‌తో మంచి మార్కులు కొట్టేసిన ఆమె,బంగార్రాజుతో ఇంకాస్త క్రేజ్ ను త‌న ఖాతాలో వేసుకుంది. స‌ర్పంచ్ నాగ‌ల‌క్ష్మిగా న‌వ్వించింది. అమాయ‌క స‌ర్పంచ్ గా అల‌రించింది. ఇక ఈ సినిమా త‌రువాత ఆమె వ‌రుస సినిమాలు చేస్తోంది.

మ‌ల‌యాళ సీమ‌ల నుంచి వ‌చ్చిన భామ అందాల కృతిశెట్టి. డెబ్యూ మూవీతోనే అదుర్స్ అనిపించింది. అస‌లు ఎవ్వ‌రూ ఊహించ‌నంత స్థాయిలో ఇవాళ వ‌రుస సినిమాలు చేస్తోంది. తెలుగు సినిమా ప్ర‌పంచంలో త‌న‌కంటూ ఓ స్థానాన్ని నిలుపుకుంటోంది. బేబ‌మ్మ జ్వ‌రంలో కుర్ర‌కారు ఊగిపోతున్నారు.ఇంకొంత కాలం బేబ‌మ్మ జ్వరం ఉంటూనే ఉంటుంది.అందులో డౌటే లేదు.

ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అందాల కృతిశెట్టి అలియాస్ బేబ‌మ్మ.. అటుపై కుర్ర‌కారును త‌న చూపుల‌తో మాట‌ల‌తో ఉర్రూత‌లూగించింది. ఏ హీరోయిన్ కు రానంత క్రేజ్ ఆమెకు మాత్ర‌మే వ‌చ్చింది. తొలి చిత్ర‌మే కానీ ఎంత‌గానో ఆకట్టుకుంది. సీనియ‌ర్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి ఇచ్చిన స‌ల‌హాలు పాటిస్తూ ఉప్పాడ తీరాన అందాల ఉప్పెన‌ల‌ను తీసుకువ‌చ్చింది. ప్రేమ ఉప్పెన‌ను మోసుకువ‌చ్చింది. నీ క‌న్ను నీలి స‌ముద్రం నా మ‌న‌సేమో అందుట్లో ప‌డ‌వ ప్ర‌యాణం అంటూ ఆ ఒక్క పాట తోనే కుర్ర‌కారంతా ఆమె ప్రేమ‌లో ప‌డిపోయేలా ఓ ఊపు ఊపేసింది.ఎనీవే బేబ‌మ్మ ఆల్ ద బెస్ట్.

Read more RELATED
Recommended to you

Latest news