దేశవ్యాప్తంగా సంచలన కలిగించిన ఉత్తర్ ప్రదేశ్ ‘లఖీంపూర్ ఖేరీ’ ఘటన గురించి అందరికీ తెలిసిందే. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేఖంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి వాహనాలతో తొక్కించడంతో రైతులు మరణించారు. సాగు చట్టాలకు వ్యతిరేఖంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి గతేడాది అక్టోబర్ 3న కారుతో తొక్కించడంతో నలుగురు రైతులు సహా 8 మంది మరణించారు. అయితే ఈ ఘటనకు ప్రధాన నిందితుడిగా కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నారు.
అయితే తాజాగా యూపీ ఎన్నికల ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్ట్ లక్నో బెంచ్ బెయిల్ మంజూరు చేసింది. గతంతో ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అయింది. దీనిపై సుప్రిం కోర్ట్ సిట్ కూడా ఏర్పాటు చేసింది. అక్టోెబర్ 9న ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఉన్న ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేసి విచారించి.. రిమాండ్ కు తరలించారు. పలుమార్లు బెయిల్ నిరాకరించిన కోర్ట్ తాజాగా ఈరోజు కోర్ట్ బెయిల్ ఇచ్చింది.