మొత్తానికి సినీ టిక్కెట్ల అంశం ఓ కొలిక్కి వచ్చేలా ఉంది.. సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దలు జగన్‌ని కలిశాక సమస్య మరింత తగ్గేలా ఉంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల రేట్లు పెంచితే.. ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గించింది.. ఏదో 1990ల కాలంలో ఉన్న రేట్లని తీసుకొచ్చింది.. అదేం అంటే పేదల కోసమే రేట్లు తగ్గించామని చెప్పింది. మరి ఇతర పన్నులు ఎందుకు పెంచారో క్లారిటీ లేదు. అంటే సినీ పరిశ్రమని తన దగ్గరకు తీసుకురావడానికే జగన్ ఈ పనిచేశారని రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేశారు.
అనుకున్నట్లుగానే జగన్ దగ్గరకు సినీ పెద్దలు వచ్చారు..మొదట నాగార్జున, ఆ తర్వాత చిరంజీవి..జగన్‌తో భేటీ అయ్యారు. ఇక తాజాగా చిరంజీవితో పాటు..మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివలు జగన్‌ని కలిశారు. అలాగే వైసీపీలో ఉన్న ఆలీ, పోసాని కృష్ణమురళి..ఇంకా ఆర్ నారాయణమూర్తి సైతం జగన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో సినీ పరిశ్రమకు సంబంధించి అనేక చర్చలు జరిగాయని తెలిసింది. అలాగే బయటకొచ్చిన తర్వాత చిరు, మహేష్, ప్రభాస్, రాజమౌళిలు మీడియాతో మాట్లాడుతూ జగన్‌కు థాంక్స్ చెబుతూ..త్వరలోనే గుడ్ న్యూస్ వింటారని చెప్పి వెళ్ళిపోయారు.
మరి ఆ గుడ్ న్యూస్ ఏంటో ఎవరికి క్లారిటీ లేదు.. సరే ఏదొకటి సమస్య అయితే ఓ కొలిక్కి వచ్చినట్లే ఉంది. కాకపోతే ఈ భేటీకి జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. మొదట తారక్ కూడా వస్తున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ తీరా చూస్తే మహేష్, ప్రభాస్ ఉన్నారు గాని తారక్ లేరు. మరి తారక్‌ని ఆహ్వానించారా? లేక ఆహ్వానం అందినా కూడా ఆయన రాలేదా? అనేది క్లారిటీగా తెలియడం లేదు.
ఒకవేళ ఎన్టీఆర్ వచ్చి జగన్‌ని కలిసి ఉంటే వైసీపీ శ్రేణులు ఆగేవారు కాదు.. అలాగే టీడీపీ శ్రేణులు గోల పెట్టేవి.. ఎన్టీఆర్‌పై ఫైర్ అయిపోయేవాళ్లు. మరి మొత్తానికి తారక్ ఆగిపోయి.. తెలుగు తమ్ముళ్ళని సేవ్ చేశారు.