ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో నూతనంగా ఏర్పాటు కాబోతున్న జిల్లాలను ఉగాది పర్వదినం నుంచే ప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. కాగ ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను పెంచాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ను సైతం విడుదల చేశారు. కాగ ఈ రోజు కోత్త జిల్లాల ఏర్పాటు అంశం పై మంత్రులు, ప్లానింగ్, రెవెన్యూ, హోం శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
కొత్త జిల్లాల్లో అధికారుల విధులకు సంబంధించిన నిర్ణయాన్ని ఈ సమావేశంలో సీఎం జగన్ తీసుకున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న కలెక్టర్లును, ఎస్పీలను కొత్త జిల్లాలకు పంపించాలని సంబంధిత అధికారులకు సీఎం జగన్ ఆదేశాలను జారీ చేశారు. కొత్త జిల్లాలకు సంబంధించిన తుది నోటిఫికేషన్ విడుదల అయిన నాటి నుంచే కొత్త జిల్లాల పరిపాలన ప్రారంభం కావాలని అధికారులకు సూచించారు. అలాగే కొత్త జిల్లాలపై ప్రజల నుంచి వచ్చే సలహాలను, సూచనలను కూడా స్వీకరించాలని సీఎం జగన్ అన్నారు.