బాబు మోటివేషన్: జనం ఆలోచిస్తారా?

-

ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు…అనూహ్యంగా స్పందించారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత బాబు మీడియా ముందుకొచ్చారు. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఉద్యోగుల సమస్యలు, నిరుద్యోగుల ఆందోళనలు, కరెంట్ కటింగ్‌లు, సినీ పరిశ్రమ ఇష్యూ, అశోక్ బాబు అరెస్ట్, రాష్ట్ర ఆర్ధిక పరిస్తితులపై బాబు స్పందించారు. అశోక్ బాబుని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయన చేసిన తప్పు ఏంటి? అని ప్రశ్నించిన బాబు..కేవలం కక్ష సాధించడం కోసమే అశోక్‌ని అరెస్ట్ చేశారని, ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూస్తామని, రోజులు అన్నీ ఒకేలా ఉండవని బాబు వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు.

chandrababu naiduఅలాగే ఉద్యోగులకు తమ హయాంలో ఏం చేశామో, మీ హయాంలో ఏం చేశారో చర్చకు సిద్ధమని బాబు సవాల్ చేశారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలని అమలు చేయకుండా, ప్రతిపక్షాలపై సీఎం ఎదురుదాడి చేయడం అనేది..ఆయన చేతకానితనానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. అసలు సినిమా పరిశ్రమకు సంబంధించి సమస్యలు సృష్టించే జగన్ అని, మళ్ళీ వాటిని పరిష్కరిస్తున్నట్లు డ్రామా ఆడి, సినిమా వాళ్లపై కక్ష సాధిస్తున్నారని అన్నారు.

ఇక తన హయాంలో 24 గంటల కరెంట్ ఉందని, ఇప్పుడు ఎప్పుడు కరెంట్ ఉంటుందో తెలియడం లేదని, పైగా కరెంట్ ఛార్జీలు భారీగా పెంచి ప్రజలపై భారం మోపారని బాబు విమర్శించారు. అలాగే జాబ్ క్యాలెండర్ పేరిట నిరుద్యోగులని మోసం చేశారని అన్నారు.

ఇక 7 లక్షల కోట్ల అప్పు చేసి ప్రజలపై ఆర్ధిక భారం పెంచారని, అసలు తన హయాంలో ప్రజల..ఆదాయం, ఖర్చు, అప్పు ఎంత? జగన్ హయాంలో ఆదాయం, ఖర్చు, అప్పు ఎంత? అనేది ప్రజలు ఒక్కసారి బేరీజు వేసుకుంటే, వారికే అర్ధమవుతుందని బాబు చెప్పారు. మరి బాబు చెప్పిన దానిలో నిజముందో అని చెప్పొచ్చు..ప్రస్తుతం జగన్ హయాంలో ప్రజలు ఖర్చు, అప్పు రెండు బాగా పెరిగాయి..ఆదాయం తగ్గింది..మరి దీనిపై ప్రజలు ఆలోచన చేస్తారో లేదో చూడాలి. ఆలోచన చేశారో లేదో తెలియాలంటే 2024 ఎన్నికల వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news