ప్రామిస్ డే రోజు ఓ మొక్కనాటి ఐ లవ్యూ చెప్పాలనుకోండి ముందుగా ఓ ట్రయిల్ వేయాలి. లేదా ముందుగానే నాలుగు మాటలు రాసుకుని పిల్లకు పంపాలి.. ఆ పనేదో ముందుగా ఈ పిల్లతోనే చేస్తే! కన్నడ సోయగానికి తెలుగు అక్షరం జతచేసి ఇస్తే నేహా శెట్టి లాంటి ఓ అపురూప భావం ఎదురుగా వచ్చి మాట్లాడుతుంది. కళ్లతో మాట్లాడి ఊహలు పంచి ఊసులు చెప్పే వెళ్తుంది.
రేపటి వేళ ఆ పిల్ల మరిన్ని సినిమాలతో సన్నజాజి తీగలాంటి నడుముతో, రకైపెక్కించే చూపుతో, మాట్లాడేందుకే మొహమాట పడేంత సిగ్గుతో మన కళ్లెదుట నిలిచి నవ్వులు పంచి సంతోషాలు ఇచ్చి వెళ్లాలని ఇవాళ కోరుకుందాం.. వెల్కం నేహా!ఇంకా చెప్పండి.. ఈ మిస్ మంగుళూరుకు అభినందనలు మరియు ఇటుగా వస్తున్నందుకు కృతజ్ఞతలు కూడా! ఇంకా అనండి ఆహా కూడా.. తెలుగులో ఈమెకు ఇది మూడో సినిమా.. ఒకటి గల్లీ రౌడి.. రెండు మెహబూబ.. మూడు డీజే టిల్లు.. ముచ్చటగా మూడో సిన్మా..ఆల్ ద బెస్ట్ టు హెర్..
అందం అంటే అమ్మాయిలకు ఇష్టం. అందంగా ఉండడం అంటే అమ్మాయిలకు ప్రాణం. అందంతో పాటు కాస్తో కూస్తో అభినయం తెలిస్తే మనకు వాళ్లంటే తెలియని అభిమానం.. అదే సమయాన తెలిసిన ప్రేమ కూడా! ఇదే ఇప్పుడు ట్రెండ్ కానుంది. ట్రెండ్‌సెట్ కూడా చేయనుంది. అవును!రేపటి వేళ డీజే టిల్లుతో మనకొక కొత్త అందం కొత్త సోయగం పరిచయం కానుంది. పబ్బుల్లో గెంతులేసే లేడి పిల్ల.. మంగుళూరు నుంచి పరుగున వచ్చిన కన్నె పిల్ల.. పిల్లగాలి ఆమెనే కావాలి.. కావాలి కాదు అయింది కూడా! ఆ పిల్ల పేరు నేహా శెట్టి.
అమ్మయిలు అంటే ఎలా ఉండాలి.. అనుష్క శెట్టి లా ఉండాలి.అమ్మాయిలు అంటే ఎలా ఉండాలి కాస్త అమాయకత్వం ఉంటే కృతిశెట్టిలా ఉండాలి. అమ్మాయి అంటే ఎలా ఉండాలి కాస్త మోడ్రన్ అయితే ఇంకా చెప్పాలంటే అల్ట్రా మోడ్రన్ అయితే నేహా శెట్టిలా ఉండాలి.ఉండాలి కాదు ఉన్నది.. ఇదిగోఇక్కడే ఉన్నది. మనలో ఉన్నది.. మనందరి మధ్య ఉన్నది ఈ చిట్టి నడుము సోయగం. ఈ చిలిపి కళ్ల సోయగం..
అందమయిన అమ్మాలకు ప్రామిస్ చేయాలి. అందమయిన అమ్మాయిలకు అందమయిన అక్షరాలలో నాలుగు మాటలు రాసి ప్రామిస్ చేయాలి. ఇవాళ ప్రామిస్ డే కదా! కనుక ఈ మంగుళూరు సోయగం నేహాశెట్టికి ప్రామిస్ చేయాలి.
కళ్లింతలు చేసుకుని మరీ! ఆమె సోయగాన్ని చూస్తూ ఉండిపోవాలి. త్వరలో మరిన్ని అందాల విందు ఆమెది. రేపటి నుంచి డీజే టిల్లుతో సందడి చేయనున్న వేళ మరో సారి తెలుగు చిత్ర సీమకు వెల్కం చెప్పేద్దాం.
– బ్యూటీ స్పీక్స్ – మనలోకం ప్రత్యేకం