నిరుద్యోగుల స‌మ‌స్య‌ల ఏపీ స‌ర్కార్ పై ప‌వ‌న్ ఆగ్ర‌హం

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ స‌మ‌స్య‌ల‌పై జ‌గ‌న్ స‌ర్కార్ పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిప్పులు చేరిగారు. త‌న ఫేసుబుక్ ఖాతా ద్వారా జ‌గ‌న్ స‌ర్కార్ పై విమ‌ర్శ‌లు కురిపించారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి వైసీపీ ప్రభుత్వానికి కార్యాచరణ ఉందా అని ప్ర‌శ్నించారు. అధికారంలోకి వచ్చాక న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తోపాటు జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తా… ఏటా 6 వేల పోలీసు ఉద్యోగాలు, పాతిక వేల టీచర్ పోస్టులు ఇస్తాను అంటూ ముద్దులుపెట్టి మరీ చెప్పారని అన్నారు. మెగా డి.ఎస్సీ లేదు.. పోలీసు ఉద్యోగాల భర్తీ లేదు.. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడం లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

pawan-kalyan

 

అధికారంలోకి వచ్చేందుకు హామీలు ఇచ్చారని ఆరోపించారు. ఉద్యోగ భర్తీలపై నిరుద్యోగులు కలెక్టరేట్ల దగ్గరకు వెళ్తే.. లాఠీ ఛార్జీలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని అన్నారు. ఉద్యోగాల భ‌ర్తీకి యాక్షన్ ప్లాన్ అనేది ఈ ప్రభుత్వం దగ్గర ఉందా అని ప్ర‌శ్నించారు. నిరుద్యోగ యువతకు మేలు చేసే విధంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల కోసం ముఖ్యమంత్రి ఎన్ని సమీక్ష సమావేశాలు నిర్వహించారని అన్నారు.

బిఈడీ చేసి టీచర్ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నవాళ్ళు.. వివిధ ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్నవాళ్లు నోటిఫికేషన్లు లేకపోవడంతో వయో పరిమితి దాటిపోతోందనే ఆందోళనలో ఉన్నారని అన్నారు. యువత ఆందోళన ప్రభుత్వానికి అర్థమవుతోందా అని ప్ర‌శ్నించారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పన అంటే తమవాళ్ళకు సలహాదారు పోస్టులు ఇచ్చుకోవడం, వాటిని పొడిగించడం కాదని విమ‌ర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news