కిష‌న్‌రెడ్డి అలా మాట్లాడ‌టం ధ‌ర్మం కాదు : కేసీఆర్

-

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇవాళ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా న‌రేంద్ర‌మోడీ ప్ర‌భుత్వం విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల‌పై మాట్లాడారు. తెలంగాణ‌లో ఫౌల్ట్రీ, హెయిర్‌క‌టింగ్ సెలూన్ త‌దిత‌ర వాటికి ఉచితంగా విద్యుత్ అందజేస్తున్నాం వాట‌న్నింటికి బంద్ చేయాల‌ని కేంద్రం చెప్ప‌క‌నే చెబుతుంది. మ‌రొక వైపు వ్య‌వ‌సాయానికి విద్యుత్ మీట‌ర్లు అమ‌ర్చుకోవాల‌ని పేర్కొంటుంది.

ముఖ్యంగా కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి అలా మాట్లాడ‌టం ధ‌ర్మం కాదు అన్నారు. కిష‌న్‌రెడ్డికి ఏమి అర్థ‌మైందో చెప్పాలి. ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ స‌రిగ్గా అర్థం చేసుకోలేదు కేసీఆర్ అని పేర్కొన్నారు. ఆహార‌ధాన్యాలు, ఎరువులు వంటి వాటిపై త‌గ్గించిన మాట వాస్త‌వం కాదా అని ప్ర‌శ్నించారు కేసీఆర్. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను ప్ర‌యివేటీక‌ర‌ణ చేయడం నిజం కాదా..? వైద్యానికి ఎక్కువ నిధులు పెట్టలేదు వాస్త‌వం కాదా..? ముఖ్యంగా బ్యాంకులు, ఎల్ఐసీలు, రైళ్లు, విమానాల‌ను ప్ర‌యివేక‌ర‌ణ చేస్తున్నారు. పేరుకేమో విద్యుత్ సంస్క‌ర‌ణ‌లు అవి ప్ర‌యివేటు వారికి అప్ప‌గించేందుకే ఈ సంస్క‌ర‌ణ‌ల‌ని పేర్కొన్నారు. మొత్తానికి న‌రేంద్ర మోడీ హ‌యాంలో దేశంనాశ‌నం అయింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు సీఎం కేసీఆర్‌. మ‌రొక‌వైపు కిష‌న్‌రెడ్డికి వార్నింగ్ కూడా ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news