ములుగులో డ్రమ్ము కలకలం.. మావోయిస్టుల డంప్ స్వాధీనం?

-

ములుగు జిల్లాలోని ఓ వ్యవసాయ పొలంలో పాతిపెట్టి ఉన్న డ్రమ్ము బయటపడింది.ఇది మావోయిస్టులకు చెందినదిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, జిల్లాలోని తాడ్వాయి మండలం ఏజెన్సీ ప్రాంతమైన కాల్వపెల్లిలో మావోయిస్టులకు చెందిన పురాతన డ్రమ్ము బయట పడింది. కాల్వపెల్లి గ్రామ శివారులో ఉన్న పీరయ్య అనే రైతు, తన పోడు భూమిని దున్నుతుండగా ఇనుప డ్రమ్ము కనిపించింది. ఆ డ్రమ్ములో ఉన్న వస్తువులను చూసిన రైతులు మావోయిస్టు డంప్‌గా భావించి ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు అక్కడినుండి వెళ్లిపోయారు.

కాల్వపల్లి గ్రామంలోని డ్రమ్ములో సదరు రైతుకు నగదు,ఆయుధాలు లభించాయని స్థానికులు ప్రచారం చేయగా, చివరకు అది పోలీసులకు చేరింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సంబంధిత ప్రదేశాన్ని బాంబ్ స్క్వాడ్‌ ద్వారా తనిఖీలు నిర్వహించారు. అయితే, ఆ ఇనుప డ్రమ్ములో ఎలాంటి ఆయుధాలు గానీ, నగదు గానీ లభించలేదు. తర్వాత రైతు పీరయ్య, ట్రాక్టర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని వారిని విచారించారు.ఇలాంటి ఘటనలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news