ఏపీలోని ట్రిపుల్ ఐటీలలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించి మీ బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తానని, ఆ బాధ్యతను తాను తీసుకుంటానని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ మేరకు విద్యార్థులకు ఆయన హామీ నిచ్చారు. అయితే, సామాజిక బాధ్యతతో విజయవాడ వరద బాధితులకు 1,565 మంది నూజివీడు విద్యార్థులు, పూర్వ విద్యార్థులు యోగా గురువు శ్రీధర్ ఆధ్వర్యంలో రూ.2,82,313ను శనివారం మంత్రి నారాలోకేశ్‌కు చెక్కు రూపేణా విరాళంగా అందజేశారు.
వరద ముంపు బాధితులకు ఇంతమంది అండగా నిలవడం చాలా గొప్ప విషయం.నా చెల్లెళ్లకు, తమ్ముళ్లకు హామీ ఇస్తున్నాను. ట్రిపుల్ ఐటీలలోని అన్ని సమస్యలను పరిష్కరించి మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే బాధ్యత నాది అని మంత్రి లోకేష్ స్పష్టంచేశారు. అయితే, స్వయంగా మంత్రి హామీ ఇవ్వడంతో తమ బాధలు తీరతాయని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.