తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ఉండే ప్రభుత్వ పాఠశాలలకు మౌళిక వసతుల కల్పన కోసం మన ఊరు – మన బడి కార్యక్రమం చేపడుతున్న విషయం తెలిసిందే. కాగ మన ఊరు – మన బడి పథకం కోసం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోర్టల్ ప్రారంభించనుంది. దీని కోసం రాష్ట్రంలోని ఐటీ అధికారులు, టీసీఎస్ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించింది. ఈ ప్రత్యేక పోర్టల్ లో పాఠశాలలకు అవసరం అయిన సౌకర్యాల గురించి పొందుపర్చనున్నారు.
అలాగే ఖర్చుల వివరాలను కూడా అందుబాటులో ఉంచనున్నారు. అలాగే ప్రతి పాఠశాలకు మరో రెండు బ్యాంకు ఖాతాను తెరవాలని నిర్ణయించింది. ఇప్పటికే పాఠశాలలకు విద్యా కమిటీ పేరు మీద బ్యాంకు ఖాతా ఉండగా.. మరో ఖాతాను ఈ పథకం ద్వారా వచ్చే నిధుల కోసం ఉపయోగించాలని భావిస్తుంది. అలాగే మరొక ఖాతా తెరిచి.. దాతాల విరాళాలను పొందుపర్చాలని నిర్ణయం కాగ మన ఊరు – మన బడి పథకం కింద త్వరలోనే మొదటి విడుత ప్రారంభిస్తారు. ఈ మొదటి విడుతలో దాదాపు 9,123 పాఠశాలల్లో ఈ పథకం ద్వారా మౌళిక వసతులు కల్పిస్తారు. మొత్తం 12 రకాల పనులు చేయనున్నారు.