సీఎం రేవంత్, మంత్రి తుమ్మల మధ్య గ్యాప్ పెరుగుతోందా ? అంటే అవుననే అంటున్నారు. తెలంగాణ క్యాబినెట్ లో సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా ఖమ్మం మంత్రులు నిలిచారు. రాలేదా? పిలవలేదా… పిలుద్దామంటే అందుబాటులో లేరా? అనే సందేహం అందరిలోనూ నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ నిన్న చేసిన సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కనిపించలేదని సమాచారం.
మరోసారి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల లేకుండానే ముఖ్యమంత్రి ఆ శాఖ పై సమీక్ష చేశారని సమాచారం. గతంలో కూడా రెండు సార్లు మంత్రి తుమ్మల లేకుండానే సమీక్ష నిర్వహించారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జి గా ఉన్న తుమ్మల లేకుండానే గతంలో రివ్యూ చేశారు ముఖ్యమంత్రి రేవంత్. దుమ్ముగూడెం పై రివ్యూ చేసినప్పుడు కూడా మంత్రి తుమ్మల లేకుండానే రివ్యూ చేశారు. నిన్నటి సమీక్షలో కనీసం ఆర్ధిక శాఖ, డిప్యూటీ సీఎం భట్టి లేకుండానే రివ్యూ చేసినట్లు సమాచారం. ఈ సమీక్షకు సంబంధించిన ఫొటోలు వీడియో లు ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు సీఎంఓ. దీంతో సీఎం రేవంత్, మంత్రి తుమ్మల మధ్య గ్యాప్ పెరుగుతోందా ? అని చర్చించుకుంటున్నారు.