వాలెంటైన్స్ డే ని బాగా జరుపుకోవాలి అని అనుకుంటున్నారా..? మీ పార్టనర్ తో ఎప్పటికీ మరిచిపోలేని వాలెంటెన్స్ డే నీ జరుపుకోవాలని మీరు అనుకున్నట్లయితే ఈ ఐడియాస్ మీకోసం. అయితే మరి వాలెంటైన్స్ డే నాడు ఏ విధంగా టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు చూద్దాం.
మూవీ నైట్:
సరదాగా మీరు నచ్చిన సినిమాని చూసి నచ్చిన ఆహారపదార్థాలని తింటూ సమయాన్ని గడపండి. అలానే ప్రేమగా కాసేపు మాట్లాడుకోండి. నిజంగా ఇలా సమయాన్ని స్పెండ్ చేస్తే ఎప్పటికి మర్చిపోలేము.
అందంగా గదిని డెకరేట్ చేయండి:
మీ గదిని అందంగా లైట్లతో కానీ బెలూన్స్ తో కానీ కొవ్వొత్తులు లేదా గులాబీలు వంటి వాటితో డెకరేట్ చేసి సర్ప్రైస్ ఇవ్వండి. ఇది కూడా మర్చిపోలేని వాలెంటెన్స్ డే అవుతుంది.
గేమ్స్ ఆడే వాళ్లకి:
మీరు కనుక గేమర్ అయితే మీరు మరింత స్పెషల్ గా మీ వాలెంటెన్స్ డే ని సెలబ్రేట్ చూసుకోవచ్చు. ఇద్దరూ కలిసి నచ్చిన గేమ్ని ఆడి సమయాన్ని గడపవచ్చు.
బోర్డ్ గేమ్స్ ఆడడం:
మీరు కనుక హై స్కూల్ నుంచి కూడా కలసి ఉన్నట్లయితే మీ ఫేవరెట్ బోర్డ్ గేమ్ ఆడండి. నిజంగా జ్ఞాపకాలను తిరిగి నెమరు వేసుకోవడానికి ఇంతకంటే మంచి ఆప్షన్ ఉండదు.
పాటలతో ఆనందంగా ఉండడం:
మీ పార్టనర్ కి పాటలు అంటే ఇష్టం ఉన్న పాటలు పాడడం అంటే ఇష్టం ఉన్నా మంచి మ్యూజిక్ తో మీరు సమయాన్ని గడపవచ్చు.
స్లోగా నక్షత్రాల కింద డాన్స్ వేయడం:
మీ పార్ట్నర్ మీరు మంచి డాన్సర్స్ అయితే టెర్రస్ మీదకి వెళ్ళి మంచి మ్యూజిక్ పెట్టుకుని డాన్స్ వేసి వాలెంటెన్స్ డే ని స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చు.
రొమాంటిక్ డిన్నర్:
క్యాండిల్ లైట్ డిన్నర్ అలాంటిది ఏమైనా ప్లాన్ చేసి చక్కగా మీరు మీ పార్టనర్ తో వాలెంటైన్స్ డే స్పెషల్ గా జరుపుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన విధంగా మీరు ఈ వాలెంటైన్స్ డే ని సెలబ్రేట్ చేసుకుని ఎప్పటికీ మరిచిపోలేని విధంగా జరుపుకోండి.