పొడి దగ్గుతో బాధపడుతున్నారా..? అయితే ఈ చిట్కాలను తప్పక పాటించాలి..!

-

చాలా మంది పొడి దగ్గుతో బాధ పడుతుంటారు. అయితే మీరు కూడా పొడి దగ్గుతో బాధ పడుతుంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి. ఆయుర్వేదం ప్రకారం ఈ చిట్కాలను మీరు అనుసరించారు అంటే ఖచ్చితంగా పొడి దగ్గు వెంటనే తగ్గుతుంది.

పొడి దగ్గు సమస్య ఉంటే పని చేసుకోవడం కష్టం అవుతుంది. అలానే నిద్రకూడా పట్టదు. అందుకని ఈ సమస్య ఉంటే వెంటనే బయట పడటం మంచిది. అయితే మరి ఎటువంటి ఆలస్యం లేకుండా ఈ ఆయుర్వేద చిట్కాల గురించి చూసేద్దాం.

దానిమ్మ:

తొక్కలు దానిమ్మ తొక్కలను ఎండలో ఎండబెట్టి వాటిని ఒక జార్ లో వేసి అందులో తేనె వేసి ఎప్పుడైతే దగ్గు అనిపిస్తుందో అప్పుడు వాటిని నమలండి. కానీ ఈ మింగేయద్దు. ఇలా చేయడం వల్ల తక్షణమే మీకు రిలీఫ్ వస్తుంది. దగ్గుతో బాధపడేవారికి ఇది మంచి చిట్కా. చిన్న పిల్లలకి కనుక పొడి దగ్గు ఉంటే కొద్దిగా దానిమ్మ రసం లో అల్లం పొడి వేసి పెట్టండి. దీంతో వాళ్ళకి చక్కటి రిలీఫ్ వస్తుంది. దానిమ్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా విటమిన్ ఏ, విటమిన్ సి కూడా ఉంటాయి. దగ్గు, జలుబు సమస్య కూడా తగ్గుతుంది.

పసుపు పాలు:

పొడి దగ్గు తో మీరు బాధపడుతున్నట్లైతే పసుపు పాలు తీసుకోవడం మంచిది. పసుపు పాల వల్ల కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. పసుపు పాలని తీసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిదే.

దగ్గు నుండి బయటపడేసే చాక్లెట్లు:

కొద్దిగా అల్లం, సోంపు, పుదీనా ఆకుల్ని తీసుకుని.. మెత్తగా పేస్ట్ చేసి చిన్నచిన్న ఉండల్లా చేసుకుని ఒక టేబుల్ స్పూన్ ని తీసుకుంటూ మిశ్రిని పొడి చేసి.. ఈ క్యాండీ ముంచి తీసుకుంటే తక్షణ రిలీఫ్ వస్తుంది ఇలా ఈ విధంగా మీరు కనుక ఫాలో అయ్యారంటే పొడి దగ్గు సమస్యనుంచి త్వరగా బయట పడవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news