వాస్తు: ఇంట్లో ఈ మొక్క ఉంటే ఆర్ధిక సమస్యలు మొదలు ఎన్నో సమస్యలు తొలగిపోతాయి…!

-

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్యలు అయినా సరే తొలగిపోతాయి. వాస్తు దోషాలు తొలగిపోవాలన్నా ఇబ్బందులు తొలగి పోవాలన్నా వాస్తు ప్రకారం అనుసరించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు ఉండడం వల్ల ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంట్లో కొన్ని మొక్కలు ఉంటే ఆనందం కలుగుతుంది అలానే ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అటువంటి మొక్కల్లో ఒకటి పసుపు మొక్క. పసుపు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.

శుభకార్యాలకు పసుపు తప్పని సరిగా వాడతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పసుపు మొక్క వేయడం వల్ల అదృష్టం వస్తుంది. ఇంట్లో ధనం పెరుగుతుంది. అలానే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే పసుపు మొక్క ఇంట్లో ఉండటం వల్ల ఆనందం కూడా పెరుగుతుంది. పసుపు మొక్క కి బృహస్పతికి డైరెక్ట్ సంబంధం ఉంది. కనుక పసుపు తో బృహస్పతిని పూజిస్తారు.

పసుపు మొక్కని మరియు అరటి మొక్కని కలిపి లక్ష్మి వారం నాడు పూజిస్తే బృహస్పతి మరియు విష్ణు అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవికి పసుపు చాలా ఇష్టం. పసుపు మొక్క ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.

ఇంట్లో ఉండే వాళ్ల మధ్య ప్రేమ పెరుగుతుంది అలానే ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి కూడా అవుతుంది. రోజూ పసుపు మొక్కని పూజిస్తే అనుకున్నవి నెరవేరుతాయి. అయితే పసుపు మొక్క ని వేసినప్పుడు ఉత్తరం లేదా తూర్పు వైపు వేయండి. ఇలా ఈ విధంగా అనుసరించి సమస్యల నుంచి దూరంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news