ఏపీలో కొత్త‌గా 615 క‌రోనా కేసులు.. న‌లుగురు మృతి

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ శాంతిస్తుంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంది. కాగ నేటి క‌రోనా బులిటెన్ ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. ఈ బులిటెన్ ప్రకారం.. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల‌లో 22,267 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు. దీంతో రాష్ట్రంలో 615 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అంతే కాకుండా గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా న‌లుగురు మృతి చెందారు.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వైర‌స్ తో మ‌ర‌ణించిని వారి సంఖ్య.. 14,702 కు చేరింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 2,787 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం 12,550 క‌రోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగ రాష్ట్రం లో థ‌ర్డ్ వేవ్ దాదాపు ముగిసింది. దీంతో రాష్ట్రంలో నైట్ క‌ర్ఫ్యూ ను కూడా సీఎం జ‌గ‌న్ ఎత్తి వేశారు. కానీ కరోనా నిబంధ‌న‌లు మాత్రం ప్ర‌జ‌లు త‌ప్ప‌క పాటించాల‌ని సూచించారు. క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌క పోతే.. రూ. 25 వేల జ‌రిమానా విధిస్తామ‌ని కూడా హెచ్చ‌రించారు.

Read more RELATED
Recommended to you

Latest news