సమక్క సారక్కలకు వినతి రాయాలే! జర జంపన్న వాగుకు పోవాలే!

-

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా, ఇప్ప‌టి ములుగు జిల్లా,తాండ్వాయి మండ‌లం,మేడారంలో నేటి నుంచి జ‌రుగుతున్న స‌మ‌క్క సార‌క్క‌ల పండ‌గ‌కు ఎన్ని ప్ర‌త్యేక‌త‌లో! సామాన్యుల పండుగల వేళ ఆ వ‌న దేవ‌త‌లు గ‌ద్దెదిగి జ‌నం మ‌ధ్యకు వ‌చ్చి దీవించి వెళ్లే ప్ర‌తి సంద‌ర్భమూ గొప్ప‌దే! మ‌న జీవితాల్లో పండ‌గలు అంటే అమ్మ‌వారికీ,అయ్య‌వారికీ చెల్లించే మొక్కులు. సామాన్యులు త‌మ ఎత్తు బంగారం (బెల్లం) అమ్మకు ఇచ్చి వ‌రాలు కోరుకోవ‌డం ఆ త‌ల్లి దీవెన‌లు అందుకుని హాయిగా ఉండడం ఈ పండ‌గ‌కే చెల్లు.

తెలంగాణ దారుల్లో ప‌ల్ల‌వించే ఆ చైత‌న్యానికి వంద‌నాలు చెల్లించాలి. క‌ల్మ‌షం లేని ప్రేమలు ద‌గ్గ‌ర వంద‌నాలు చెల్లించాలి. ప్ర‌తాప‌రుద్రుడి పండుగ ఇది..కాక‌తీయులు న‌డ‌యాడిన నేలలో స‌మ్మ‌క్క సార‌ల‌మ్మల పండుగ.. ఆ త‌ల్లుల దీవెన‌లు అందుకుంటే బిడ్డ‌ల‌కు కొండంత భ‌రోసా ద‌క్కింద‌ని భావించాలి.. ఆ వ‌రాల వేళ ఆ ఆనందాల వేళ త‌ల్లుల‌కు బిడ్డ‌లు మ‌రింత చేరువ.

సామాన్యుల పండుగ‌లో ఏ ఆర్భాటాలూ ఉండ‌వు.వీరుల స్మ‌ర‌ణ‌లో ఎటువంటి భేష‌జం ఉండ‌దు. త‌ల్లులొచ్చి బిడ్డ‌ల‌ను దీవించేందుకు సిద్ధంగా ఉండే పండుగ. ఆ పండుగ వేళ తెలంగాణ నేల పుల‌కిస్తోంది. అస‌లు హ‌ద్దే లేని ఆనందాల‌కు ఆ నేల ఆనవాలు అయి ఉంటుంది. పండుగ అంటే మొక్కులు చెల్లించి జాత‌ర తిరిగి ముందుకువెళ్ల‌డ‌మే! సాధించాల్సినవి త‌ల్చుకుని అమ్మ దీవెన‌ల‌తో సాధించ‌డ‌మే! తెలంగాణ పండుగంటే ఎన్నో వైభ‌వాలు.. ఇది జాతి పండుగ.. సాంస్కృతిక వారధి
ఈ పండుగ..

ఆంధ్రా,తెలంగాణ నేల‌ల‌కు ఈ త‌ల్లి దీవెనలు ఉండాలి.. పంట‌లు పండాలి.. త‌ల్లుల‌కు అభ‌యం ఉండాలి.. త‌ల్లుల‌కు బిడ్డ‌ల‌కు ప్రేమ అన్న‌ది ప‌ర‌మావ‌ధి కావాలి. ఇవాళ నుంచి మూడు రోజుల పాటు జ‌రిగే ఆ మేడారం జాత‌ర అంద‌రికీ ఆనందాలు ఇవ్వాలి. అంద‌రికీ శుభాకాంక్ష‌లు..
త‌ల్లుల‌కు వంద‌నాలు..

Read more RELATED
Recommended to you

Latest news