ఆర్టీసీ ఎండీ గా మాజీ ఐపీఎస్ అధికారి సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలతో ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకెళ్లారు ఎండీ సజ్జనార్. దీంతో పాటు సంస్థను ప్రమోట్ చేయడానికి ఎప్పటికప్పుడు పలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు సజ్జనార్.ఈ నేపథ్యంలో అనేక సినిమా క్లిప్పింగ్ లను ఆయన షేర్ చేశారు. ఇంకా సైబర్ నేరాలపై కూడా అవగాహన కల్పించే వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు.
సదూర ప్రయాణాలకు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి తన ప్రత్యేకతను చాటారు సజ్జనారు. తాజాగా ప్రయాణికుల భద్రత కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆర్టిసి ఎండి సజ్జనార్.
ముఖ్యంగా మహిళలు సురక్షితంగా ఇంటికి చేరుకునేందుకు.. ప్రత్యేకమైన యాప్ ను తీసుకువచ్చారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. బస్సులో ఎలాంటి అభద్రత భావాలు కలిగినా, లేదా బస్సు అసౌకర్యంగా ఉన్నా .. వెంటనే ఈ యాప్ కు సంబంధించిన స్కానర్ లో మొబైల్ తో స్కాన్ చేసి… తమ ఫిర్యాదులను ఆర్టీసీకి తెలుసుకోవచ్చని సజ్జనార్ ప్రకటన చేశారు. ఈ మేరకు ఆప్ కు సంబంధించిన స్కానర్ ను లాంచ్ చేసింది తెలంగాణ రాష్ట్ర ఆర్ టి సి యాజమాన్యం.
Started Implementing the pilot scheme of My Bus Is Safe in #TSRTCBuses pic.twitter.com/Wm1XfVyBlg
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) February 20, 2022