పోలీసు నీడ‌లో భీమ్లా నాయ‌క్ ?

-

మోస్ట్ ఎవైటింగ్ మూవీ భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ వేడుక‌లకు అంతా సిద్ధం అవుతోంది. ముఖ్యంగా వేడుక‌లను పోలీసు క‌నుస‌న్న‌ల్లో నే నిర్వ‌హించేందుకు, పాసుల జారీకి సంబంధించిన అధికారం కూడా  పోలీసుల‌కే ఇచ్చేందుకు చిత్ర యూనిట్ నిర్ణ‌యం తీసుకుంది. గ‌త ప‌రిణామాల నేప‌థ్యంలో ఎటువంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లూ జ‌ర‌గ‌కుండా ఉండేందుకు చిత్ర యూనిట్,పోలీసుల‌తో క‌లిసి ప‌నిచేయ‌నుంది. ఇక ఐదు వేల పాసుల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చేందుకు పోలీసులు స‌మ్మ‌తించారు.

bheemla nayak
bheemla nayak

హైద్రాబాద్,యూస‌ఫ్‌గూడ,పోలీసు గ్రౌండ్స్ లో జ‌రిగే ఈవెంట్ కు అంత‌కుమించి అనుమ‌తి ఇవ్వ‌కూడద‌ని కూడా భావిస్తోంది.గ‌తంలో పుష్ప ప్రీ రిలీజ్ వేడుక‌ల కు ఇదే విధంగా ఎక్కువ మంది రావ‌డంతో తొక్కిస‌లాట‌లు జ‌రిగాయి.ప‌లువురు అభిమానులు గాయ‌ప‌డ్డారు కూడా! ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ఫంక్ష‌న్ అంటే అంత‌కుమించి వ‌చ్చే అవ‌కాశాలు ఉండ‌డంతో పోలీసులు ముందుగానే అప్ర‌మ‌త్తం అయ్యారు. అన్నింటికీ మించి వేడుక‌లకు తెలంగాణ మంత్రులు కేటీఆర్, త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ రానుండ‌డంతో టీఆర్ఎస్ శ్రేణులు కూడా వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. వీట‌న్నంటినీ దృష్టిలో ఉంచుకుని పాస్ లు జారీ చేసే బాధ్య‌త‌ను పోలీసుల‌కే అప్ప‌గించాయి చిత్ర నిర్మాణ వ‌ర్గాలు.

Read more RELATED
Recommended to you

Latest news