ఏజ్‌ అయిపోయిన రోహిత్‌ కు ఎందుకు కెప్టెన్సీ ? : దినేష్ కార్తీక్

-

రోహిత్ శర్మకు అన్ని ఫార్మాట్ల కెప్టెన్ ఇవ్వడంపై ఇవ్వడంపై దినేష్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోపి శర్మ తన అద్భుతమైన వ్యూహాలతో జట్టును ముందుకు నడిపిస్తున్నాడని కొనియాడుతూనే రాబోయే రోజుల్లో కెప్టెన్గా కఠినమైన సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని రోహిత్ శర్మ ను హెచ్చరించారు. రోహిత్ శర్మ ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా నియామకం అయ్యాడని దినేష్ కార్తీక్ పేర్కొన్నారు.

అయితే కెప్టెన్ గా రోహిత్ ఏడాది మొత్తం చాలా క్రికెట్ ఆడాల్సి ఉంటుందని… అదే అతనికి పెద్ద సవాలుగా మారనుంది అని చెప్పుకొచ్చాడు. రోహిత్ చాలా తెలివైన వాడు కాబట్టి కెప్టెన్సీ ఇచ్చారనీ అన్నాడు. అయితే రోహిత్ శర్మకు ఇప్పటికీ 34 సంవత్సరాలు పూర్తయ్యాయని… ఈ వయసులో కెప్టెన్సీ అనేది చాలా కష్టతరం అని చెప్పుకొచ్చాడు. దీనిపై బిసిసిఐ మరోసారి పునరాలోచించాలని సూచనలు చేశాడు దినేష్ కార్తీక్. అటు రోహిత్‌ శర్మకు కెప్టెన్సీ ఇవ్వడంతో.. సీనియర్లు కూడా మండి పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news