ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీస్ మరో రికార్డ్… కర్జోక్ కాంగ్రీ పర్వతాన్ని తొలిసారి అధిరోహించిన ఐటీబీపీ

-

గడ్డకట్టే చలిని లెక్క చేయకుండా.. హిమాలయాల్లో మన సరిహద్దులను కాపు కాస్తోంది మన ఆర్మీ. ముఖ్యంగా ఇండో- టిబెటిన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) హిమాలయల్లో ఎనలేని సాహసాలను ప్రదర్శిస్తోంది. జమ్మూ కాశ్మీర్ నుంచి సిక్కిం వరకు విస్తరించి ఉన్న హిమాలయాల్లో మన సరిహద్దులను శత్రు దేశాల నుంచి ఓ కంట కనిపెడుతున్నాయి. ఇటీవల హిమాలయాల్లో 15000 అడుగుల ఎత్తులో పహరా కాస్తున్న ఐటీబీటీ సైనికులు వీడియో వైరల్ అయింది. తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది ఐటీబీపీ.

తొలిసారిగా కర్జోక్ కాంగ్రీ పర్వతాన్ని అధిరోహించింది. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) సెంట్రల్ పర్వతారోహణ బృందం ఈ ఫీట్ సాధించింది. కనిష్ట ఉష్ణోగ్రత -40 డిగ్రీల సెల్సియస్ ఉన్న తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఫిబ్రవరి 20న లడఖ్‌లోని కర్జోక్ కాంగ్రీ పర్వతాన్ని అధిరోహించింది.

పర్వతారోహకుడు కమాండెంట్ రతన్ సింగ్ సోనాల్ నేతృత్వంలోని ఐటీబీపీకి చెందిన 6 మంది పర్వతారోహకుల బృందం లడఖ్‌లో ఉన్న 20,177 అడుగుల ఎత్తైన శిఖరాన్ని అధిరోహించింది. ఈ బృందానికి డివై కమాండెంట్ అనూప్ నేగి డిప్యూటీ లీడర్‌గా ఉన్నారు. బృందం ఎటువంటి ప్రత్యేక పర్వతారోహణ పరికరాలు, సహాయక వ్యవస్థ లేకుండా ఈ పర్వతాన్ని అధిరోహించారు.

Read more RELATED
Recommended to you

Latest news