ఏపీ పోలీస్‌ శాఖ అరుదైన గౌరవం..15 జాతీయ స్థాయి అవార్డులు

-

అమరావతి : జాతీయ స్థాయిలో టెక్నాలజి వినియోగంలో తాజాగా మరో 15 అవార్డులను దక్కించుకుంది ఏపీ పోలీస్ శాఖ. టెక్నాలజీ సభ- 2022 ప్రకటించిన అవార్డులలో 15 అవార్డులను వివిధ విభాగాల్లో కైవసం చేసుకొని, మొత్తం 165 అవార్డు లను గెలుచుకుంది. టెక్నాలజీ వినియోగంలో జాతీయస్థాయిలో 165 అవార్డులతో మొదటి స్థానంలో నిలిచింది ఏపీ పోలీస్ శాఖ.

టెక్నాలజీ వినియోగిస్తూ జాతీయ స్థాయిలో అవార్డుల దక్కించుకోవడంతో మాపై ప్రజలకు సేవ చేసే బాధ్యత మరింతగా పెంచింది. పోలీస్ ప్రధాన కార్యాలయం తోపాటు వివిధ జిల్లాలో అవార్డులను సాధించిన సిబ్బందిని అభినందించింది డిజిపి. జాతీయ స్థాయిలో అవార్డులను దక్కించుకున్న విజేతలందరిని అభినందించారు ముఖ్యమంత్రి వైఎస్.జగన్ పోలీస్ ప్రధాన కార్యాలయం (8),అనంతపురం (1), చిత్తూరు (1), తిరుపతి అర్బన్ (2), కడప (1), ప్రకాశం (1), విజయవాడ సిటీ (1) ఈ లిస్టులో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news