తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు కావాలంటే…. మంచి ఛాయిస్ కీర దోస సాగు

-

వ్యవసాయం రూపు మారుతోంది. సంప్రదాయ పంటల సాగు నుంచి మెల్లిమెల్లిగా రైతులు కొత్త పంటలు, పళ్ల తోటల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ సమయం, తక్కువ పెట్టుబడితో.. నమ్మకమైన ఆదాయం రావాలంటే కీర దోస మంచి పంటగా ఉంది.

వేసవి కాలంతో కీర దోసకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దాహార్తిని తీర్చడంతో పాటు.. సలాడ్ లతో పాటు పలు రకాల జ్యూస్ లతో కీరదోసను వినియోగిస్తున్నారు. వేసవిలోనే కాకుండా ఇతర సమయాల్లో కూడా కీరకు డిమాండ్ ఉంటుంది.

దీంతో పాటు తక్కువ సమయం అంటే కేవల 60 నుంచి 90 రోజుల్లోనే పంట చేతికి రావడం కీర దోస ప్రత్యేకత. తక్కువ సమయంలోనే రైతులు లాభాలు పొందే అవకాశం ఉంటుంది. విత్తనం నాటిన 30 రోజులకు మొదలై… 60 రోజుల్లోనే పంట చేతికి వస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో కీర ధర రూ. 25-30 పలుకుతోంది.

యాజమాన్య పద్దతులు:

కీర దోసను సాగు చేయాలంటే రెండు సార్లు దుక్కి దున్నకోవాలి. కీరను నాటేందుకు 5 ఫీట్లకు ఒక లోతు సాలు చేసుకోవాలి. లేకపోతే ఎత్తు బెడ్స్ చేసుకోవాలి. డ్రిప్ మరియు మల్చింగ్ పద్దతిిలో కీరను సాగు చేస్తే మంచి దిగుబడిని సాగు చేసుకోవాలి. ఆకరు దుక్కిలో 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు, 200 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పెట్, 33.3 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను ఆఖరు దుక్కిలో వేయాలి. హైబ్రీడ్ రకం అయితే ఒక ఎకరానికి 300-400 గ్రాముల విత్తనం అవసరం అవుతుంది. కిలో విత్తనానికి 5 మిల్లీ లీటర్ల ఇమిడోక్లోఫ్రిడ్ అవసరం అవుతుంది. దీంతో విత్తన శుద్ధి చేసుకోవాలి.

నాటు కోవడానికి రెండు వరసలకు మధ్య 1.5 సెంటీ మీటర్లు, వరసలోని మొక్కల మధ్య 45-50 సెంటీ మీటర్లు ఉండేలా విత్తనాలు నాటుకోవాలి. విత్తనం మొలకెత్తిన తర్వాత.. రెండు, నాలుగు ఆకుల దశలో రెండు సార్లు లీటర్ కు 3 గ్రాములు కలిపి పిచికారి చేసుకువాలి. ఇది చేసుకోకుంటే… పూతకు ముందు సైకోసిల్ 2.5 గ్రాములు పదిలీటర్ల నీటికి కలిపి లేకపోతే ఇథరిల్ 2.5 గ్రాములు పదిలీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. విత్తిన 20-30 రోజుల్లో, కాత పూత దశలో యూరియాను మొక్కలకు వేసుకోవాలి. కీరలో ఎండ వాతావరణ ఉన్నపుడు పూత, పింద రాలుతాయి. దీని కోసం మైక్రో న్యూట్రియన్స్ మిశ్రమాన్ని లీటర్ నీటికి 5 గ్రాములు, 0.23 మిల్లి గ్రాముల ఫ్లోనోఫిక్స్ మిశ్రమాన్ని కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు ఇవ్వాలి. తామర పురుగు, రసం పీల్చే పురుగులను నివారించేందుకు ఇమిడాక్లోరోఫిన్ అనే రసాయనాన్ని లీటర్ నీటికి 0.35 మిల్లీ లీటర్ ని కలిపి పిచికారి చేసుకోవాలి.

స్టేకింగ్ పద్దతితో మరింత ప్రయోజనం:

కీరదోసను స్టేకింగ్ విధానం ద్వారా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. స్టేకింగ్ పద్దతి ద్వారా… కర్రల సహాయంతో ఓ తాడుకు వేలాడదీయడంతో కీర దోస మంచి ఆకారంతో పాటు సరైన విధంగా పెరుగుతుంది. దీంతో కీరను చూడగానే మంచి లుక్ వస్తుంది. కీరలు నాణ్యత బాగుంటే మరింతగా ధర పలికే అవకాశం ఉంటుంది. మనం నేలపై  పండిస్తే.. కీర ఓ వైపు ఆకుపచ్చగా ఉండి, మరోవైపు తెల్లగా ఉంటుంది. భూమి మీద కీరదోసను పండిస్తే తెగుళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే స్టేకింగ్ పద్దతిలో అయితే తెగుళ్లు తగ్గించే అవకాశం ఉంటుంది. డ్రిప్ విధానంతో మల్చింగ్ షీట్ వేస్తే మొక్కలకు నీరు అందించడంతో పాటు… కలుపును కూడా అదుపు చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news