రష్యా- ఉక్రెయిన్ ల మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతోంది. రష్యా సేనలు రాజధాని కీవ్ ను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాజధాని కీవ్ కు 30 కిలోమీటర్ల దూరంలో రష్యన్ ఆర్మీ ఉన్నట్లు దేశవ్యాప్తంగా ఉక్రెయిన్ బలగాలు గట్టి ప్రతిఘటన కొనసాగిస్తున్నాయని.. యూకే రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇదిలా ఉంటే రష్యా సంచలన ప్రకటన ప్రకటన చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ రాజధాని కీవ్ ను వదిలి పారిపోయాడని అంటోంది. లెవీవ్ లో ఒక రహస్య ప్రాంతంలో తలదాచుకున్నట్లు చెబుతోంది రష్యా. అయితే రష్య ప్రకటనకు కొంత సేపు ముందు అధ్యక్షుడు జెలన్ స్కీ తమ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కీవ్ ను వదిలిపారిపోలేదని.. రాజధాని ఇంకా తమ ఆధీనంలోనే ఉందని జెలన్ స్కీ స్పష్టం చేశాడు. ఎవరు ముందుకు వచ్చి సహాయం చేయాలనుకున్నా… మేం వారికి ఆయుధాలు ఇస్తామని ఆయన అన్నారు. మనం ఈ యుద్ధాన్ని ఆపాలి, శాంతిని తీసుకురావాలి అని జెలన్ స్కీ ప్రజలనుద్దేశించి అన్నారు.