Tirumala: సామాన్య భక్తులకు టీటీడీ శుభవార్త

-

తిరుమల శ్రీవారి సామాన్య భక్తులకు టీటీడీ పాలకమండలి అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇప్పటికే శుక్ర, శని అలాగే ఆదివారాల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ పాలక మండలి తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఈ మూడు రోజులపాటు సిఫార్సు లేఖలు కలిగిన భక్తులను అనుమతించే సమస్య లేదని తేల్చి చెప్పింది.

ఇకపై గురు, శుక్ర శనివారాల్లో సిఫార్స్ లేఖలు కలిగిన భక్తులను అలిపిరి తానిఖి కేంద్రంలోనే గుర్తించి… కొండపైకి అనుమతించబోమని టీటీడీ సి వి ఎస్ ఓ గోపీనాథ్ శక్తి ప్రకటన చేశారు. ఈ మేరకు తిరుపతిలోని అలిపిరి అలాగే తిరుమలలో గోపిశెట్టి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా టిటిడి నిగా, భద్రత అధికారులకు ఇతర శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

శ్రీ వారి దర్శనం కోసం వచ్చే భక్తులు దళారులను నమ్మకూడదని ఆయన సూచించారు. దళాలు లో ఎవరైనా ప్రలోభాలకు గురి చేస్తే వెంటనే టిటిడి భద్రత అలాగే నిఘా అధికారులకు తెలియజేయాలని ఆయన కోరారు. శ్రీవారి దర్శన టికెట్లను పెంచిన నేపథ్యంలో భక్తులు ఇబ్బందులు లేకుండా చూడాలని టిటిడి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news