ఎవరి జాగ్రత్తలో వారు ఉంటే దానిని యుద్ధం అనరు
కేవలం అవకాశవాదం అని అంటారు.ఇప్పుడు వైసీపీతో
వైరం పెట్టుకోవడం కాదు కదా!కనీసం సంబంధిత నిర్ణయాలపై
మాట్లాడేవారే లేరు.అలాంటప్పుడు థియేటర్ వ్యవస్థకు
మంచిరోజులు ఎప్పుడొస్తాయని?
పవన్ ఒక్కడే యుద్ధం చేస్తున్నాడు.మిగిలిన వారికి ఏం ఖర్మ..మాట్లాడేందుకు! అందుకే వారంతా మాట్లాడకుండా ఉండిపోతు న్నారు.సినిమా పరిశ్రమపై వైసీపీ విధిస్తున్న ఆంక్షలను ముఖ్యంగా థియేటర్ వ్యవస్థపై చేస్తున్న దాడులను వేటినీ కూడా నిలువరించేందుకు ఇండస్ట్రీ తరఫున ఎవ్వరూ పెద్దగా మాట్లాడిన దాఖలాలే లేవు.అలాంటప్పుడు పవన్ చేసే యుద్ధం గెలుస్తుందా? పవన్ ఒక్కడే ఒంటరిగా మిగిలిపోతాడా? భీమ్లా నాయక్ సినిమా కలెక్షన్లు బాగున్నాయి అని తెలిసినప్పటి నుంచి సంబంధిత వైసీపీ వర్గాల్లో కలవరం మొదలైంది.దీంతో థియేటర్ వ్యవస్థపై మరిన్ని దాడులకు వైసీపీ సర్కారు సన్నద్ధం అవుతోందని అంటోంది జనసేన. తాము ఊపిరి ఉన్నంత వరకూ పోరాడతామని,చిన్న సమస్యను పెద్దదిగా చేసి చూపడంలో జగన్ సక్సెస్ అయ్యారు అని పవన్ అభిమానులు పెదవి విరుస్తున్నారు.
అన్యాయం అయిందని మీరు స్టేషన్ కు వెళ్లకండి.పట్టాదారు పాసుపుస్తకం కావాలని మీరు తహశీల్దార్ ను అడగకండి.ఎందుకంటే ఈ రెండూ మీకు ఎటువంటి భరోసానూ ఇవ్వవు.కానీ భీమ్లా నాయక్ థియేటర్ దగ్గర మాత్రం ఆ ఇద్దరూ మీకు కనిపిస్తారు.అటు తహశీల్దార్ కానీ ఇటు పోలీసు కానీ ప్రజలకు ఎంతగానో అక్కడ అండగా ఉంటారు.జీఓ నంబర్ 35ను అమలు చేయడమే తమ ధ్యేయం అని చెబుతారు.చెప్పి వెళ్తారు.ఆ విధంగా పోలీసు శాఖ మరియు రెవెన్యూ శాఖ స్వామి భక్తిలో పులకించిపోవడం ఖాయం.
పోలీసులు థియేటర్ల దగ్గర ఉదయం నాలుగు గంటలకే వస్తారు.అర్ధ రాత్రి 12 గంటల నుంచి థియేటర్ పై నిఘా ఉంచుతారు.ఐదో షో వేస్తున్నారా లేదా అన్నది వారి సందేహం.పోనీ ఆ షో అంటూ ఏమీ లేదు అని చెప్పినా వెళ్తారా లేదు. టిక్కెట్లు ఎలా అమ్మాలో వాళ్లే చెబుతారు.అమ్ముతుంటే దొమ్మీ పేరిట అభిమానులను తంతారు.ఏం చేసినా రెవెన్యూ ఆఫీసర్ అలా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఏపీలో ఇంతకుమించి చేసేదేం లేదు కనుక! ప్రజల తరఫున మాట్లాడినా కూడా తగిన గౌరవం ఏ అధికారికీ దక్కదు కనుక!
నిబంధనలు మేం తప్పు పట్టం..అలా అని మేం దారి తప్పం అని ఎన్నోసార్లు థియేటర్ యజమాన్యాలు ఆధారాలతో సహా వివరాలను పోలీసులకు,రెవెన్యూ అధికారులకు ఇచ్చారు.అయినా కూడా వారికి నమ్మకం లేక కౌంటర్లలో ఫ్యాన్స్ కన్నా ఘోరంగా పడిగాపులు పడ్డారు.చాలా మంది వైసీపీ నాయకులకు మన గౌరవ తహశీల్దార్లే టిక్కెట్లు ఇచ్చి మరీ!లోపలికి పంపారు.కొన్ని టిక్కెట్లు అమ్మకుండా అడ్డుకుని వాటిని స్థానిక అధికార పార్టీ నాయకులకు పంపారు.ఇంత చేసినా కూడా పాపం వారికి అలసట రాలేదు.ఇంతగా ఎప్పుడయినా ఓ ప్రజా సమస్యను పరిష్కరించడంలో చొరవ చూపారా అంటే లేదన్నదే ఓ సమాధానంగా వినవస్తుంది.