నల్గొండ: శ్రీశైల క్షేత్రానికి ప్రత్యేక బస్సులు

-

దేవరకొండ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి సోమ, మంగళవారాల్లో ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు డీఎం రాజీవ్ ప్రేమ్‌కుమార్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం దేవరకొండ బస్‌స్టేషన్ నుంచి, మంగళవారం మిర్యాలగూడ, నల్గొండ, దేవరకొండ బస్ స్టేషన్ల నుంచి ప్రయాణీకుల రద్దీ ప్రకారం నడుపుతామని తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news