భారత టీ 20 ఫార్మెట్ కు రోహిత్ శర్మ కెప్టెన్ గా వచ్చిన నాటి నుంచి రికార్డుల మోత మోగిపోతుంది. ఇప్పటి కే వెస్టిండీస్ తో జరిగిన టీ 20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ సేనా.. తాజా గా శ్రీలంకను కూడా క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం ధర్మశాల వేదికగా జరిగిన మూడో టీ 20 మ్యాచ్ లో భారత్ గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. అంతే కాకుండా శ్రీలంకను వైట్ వాష్ చేసింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో వరుసగా 12 టీ 20 మ్యాచ్ ల్లో విజయం సాధించని జట్టుగా భారత్ రికార్డు సృష్టించి.. ఆఫ్ఘాన్ సరసన చేరుకుంది.
ఆఫ్ఘాన్ కూడా వరుసగా 12 టీ 20 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ఇది ఇలా ఉండగా.. శ్రీలంక తో జరిగిన మూడో టీ 20 మ్యాచ్ లో టాస్ నెగ్గిన శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసింది. భారత బౌలర్ల దాటికి లంక ఓపెనర్లు.. టాప్ ఆర్డర్లు చేతులెత్తేశారు. 12.1 ఓవర్ల వరకు ప్రధానమైన 5 వికెట్లు కొల్పొయి.. 60 పరుగులు మాత్రమే చేసింది. తర్వాత లంక కెప్టెన్ షనక కేవలం 38 బంతుల్లో 74 పరుగులు చేశాడు. దీంతో శ్రీలంక 146 గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.
147 పరుగులు టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్.. ఓపెనర్లు విఫలం అయినా.. యువ సంచలనం శ్రేయస్ అయ్యార్ (73) వీర విహారంతో ఇంకా రెండు ఓవర్లు ఉండగానే విజయాన్ని అందుకుంది. కాగ ఈ మ్యాచ్ లో 73 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రేయస్ అయ్యార్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అలాగే ఈ సిరీస్ లో వరుసగా 57, 74,73 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యార్ కే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది.