కరోనా వైరస్ ఇప్పటికు యావత్ ప్రపంచాన్ని విధ్వంసం సృష్టించింది. ఇప్పటి వరకు వచ్చిన మూడు వేవ్ లలో లక్షల మంది కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందారు. ఇటీవల ఓమిక్రాన్ వేరియంట్ కారణంగా వచ్చిన థర్డ్ వేవ్ లో కూడా భారత్ లో ప్రతి రోజు దాదాపు 4 లక్షలకు పైగా.. కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అలాగే ప్రతి రోజు వందల సంఖ్య మరణించారు. అయితే గత కొద్ది రోజుల థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలాంటి సందర్భంలో ఐఐటీ కాన్పూర్ సంచలన ప్రకటన చేసింది.
భారత్ కు కరోనా ముప్పు ఇంకా పోలేదని ప్రకటన చేసింది. భారత్ లో నాలుగో వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని బాంబ్ పెల్చింది. జూన్ 22 నుంచి అక్టోబర్ 24 వరకు ఈ కరోనా నాలుగో వేవ్ విజృంభించే అవకాశాలు ఉన్నాయని ఐఐటీ కాన్పూర్ వైద్య పరిశోదకులు అభిప్రయ పడ్డారు. అయితే ఫోర్గ్ వేవ్ తీవ్కత.. కరోనా కొత్త వేరియంట్లు, దాని మ్యూటేషన్లుపై ఆధార పడి ఉంటుందని అన్నారు. అలాగే కొత్త వేరియంట్ల పై.. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు ఎంత ప్రభావం ఆధారంగా కూడా తీవ్రత మారే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు.