Grand Nursery Mela : నేటితో ముగియ‌నున్న న‌ర్స‌రీ మేళా..!

-

హైద‌రాబాద్ నెక్లెస్ రోడ్డులోని పిపుల్స్ ప్లాజాలో అసోసియేష‌న్ ఆఫ్ ఈవెంట్ ఆర్గ‌నైజ‌ర్స్ సంస్థ ఆధ్వ‌ర్యంలో గ్రాండ్ న‌ర్స‌రీ మేళాను నిర్వ‌హించారు. ఐదు రోజుల పాటు నిర్వ‌హించిన ఈ ప్ర‌ద‌ర్శ‌న నేటితో ముగియ‌నుంది. ఇందులో దేశం న‌లుమూల‌ల నుంచి ప్ర‌ముఖ విత్త‌న, న‌ర్స‌రీ, సేంద్రీయ ఉత్ప‌త్తుల, వ్య‌వ‌సాయ ప‌నిముట్లు, టెర్ర‌సె గార్డెనింగ్ సంస్థ‌లు త‌ర‌లి వ‌చ్చి త‌మ స్టాళ్లు ఏర్పాటు చేశాయి. తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్, మ‌హారాష్ట్ర, క‌ర్నాట‌క‌, ప‌శ్చిమ బెంగాల్‌, కేర‌ళ‌, ఉత్త‌ర ప్ర‌దేశ్, రాజ‌స్థాన్‌, పంజాబ్‌, హ‌ర్యానా, త‌మిళ‌నాడు రాష్ట్రాల నుంచి ప‌లు విత్త‌న న‌ర్స‌రీ టెర్ర‌స్ గార్డెనింగ్ ఇత‌ర సంస్థ‌లు 150 వ‌ర‌కు స్టాళ్లు కొలువు తీరాయి.


ఈ మేళాలో నాణ్య‌మైన దేశ‌వాళీ సంక‌ర జాతి విత్త‌నాలే కాకుండా న‌గ‌ర సేద్యం సంబంధించి అంద‌మైన పూలు, కూర‌గాయ‌ల మొక్క‌లు, నారు, అలంక‌ర‌ణ మొక్క‌లు, కుండీలు, పిచికారీ యంత్రాలు, ప‌ని ముట్లు, సామాగ్రి, సేంద్రీయ ఉత్ప‌త్తులు, మార్కెటింగ్ వ్యూహాలు ప్ర‌ద‌ర్శించారు. ఈ సారి ఆధునిక విజ్ఞానం, యంత్రాలు, వ‌ర్టిక‌ల్ గార్డెనింగ్, టెర్ర‌స్ గార్డెనింగ్‌, కిచెన్ గార్డెనింగ్, లాండ్ స్కేప్‌, హైడ్రోపొనిక్స్ వంటి సాంకేతిక ప‌రిజ్ఞానాలు ప్ర‌త్యేక‌త‌లని తెలంగాణ ఈవెంట్స్ ఆర్గ‌నైజ‌ర్స్ సంస్థ అధ్య‌క్షుడు ఖ‌లీల్ అహ్మ‌ద్ తెలిపారు. గ‌తంలో కంటే ఈ ఏడాది సంద‌ర్శ‌కుల తాకిడి బాగా పెరిగింద‌ని నిర్వాహ‌కులు వెల్ల‌డించారు. ప్ర‌తిరోజు 10 వేల నుంచి 15వేల మంది సంద‌ర్శ‌కులు వ‌స్తున్నార‌ని నిర్వ‌హ‌కులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news