అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లాలనుకునే భారతీయులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది బైడెన్ ప్రభుత్వం. కొన్ని రకాల వీసాలకు వ్యక్తిగత ఇంటర్వ్యూలో నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తాజాగా అమెరికా ప్రకటన చేసింది. విద్యార్థి, వృత్తి అలాగే కళాకారులకు సంబంధించిన వివిధ రకాల వీసా దరఖాస్తు దారులకు ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ మినహాయింపు ఇస్తున్నట్లు అమెరికాకు చెందిన ఓ సీనియర్ అధికారి భారత సంతతి ప్రతినిధులకు వివరించారు.
విద్యార్థులు, వృత్తి నిపుణులు, కళాకారులు, విశిష్ట ప్రతిభావంతులకు ఇచ్చే వీసా దరఖాస్తులకు ఈ మినహాయింపు వర్తిస్తుందని తెలిపింది అమెరికా. ఇంటర్వ్యూ రద్దు కారణంగా చాలామంది వీసా దరఖాస్తులకు మేలు జరగనుందని దక్షిణాసియా అజయ్ జైన్ తెలిపారు.
దీని వల్ల చాలా మందికి ఉన్న అడ్డంకులు అలాగే అవరోధాలు తొలగిపోతాయని ఆయన వివరించారు. ఈయన ఏషియన్ అమెరికన్లకు సంబంధించిన అంశాల్లో అమెరికా అధ్యక్షుడు బైడేన్ కు సలహాదారుడిగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 31వ తేదీ వరకు ఇంటర్వ్యూలు రద్దు చేస్తున్నట్లు ఆయన వివరించారు.