మెదక్ : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

-

మెదక్ జిల్లా కొల్చారం మండలం కొంగోడు గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైకును కారు ఢీకొట్టడంతో వెల్దుర్తి మండలం దామరంచ గ్రామానికి చెందిన పొలం పల్లి నరసయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. అతని కూతురు మల్లమ్మ, బైక్ నడుపుతున్న సంతోష్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. వారిని మెదక్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news