ఇంజినీర్ ఉద్యోగాన్ని మానేసి పూలతో రూ.18 లక్షలు… వంద మందికి ఉపాధి కూడా..!

-

బీటెక్ పూర్తి చేసిన తర్వాత అభినవ్ సింగ్ కి మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం వచ్చింది. దీంతో ఆయన ఇంగ్లాండ్ వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇంత డబ్బులు వస్తున్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులను, స్నేహితులను మిస్ అవుతున్నాను అని ఆయన అనుకున్నారు. వీకెండ్ సమయంలో ఆయన యూరప్ వంటి చోట్లకి పార్టీలకు వెళ్లేవారు అయితే ఆయన ఎక్కడో విదేశాల్లో వున్నా హృదయం ఇక్కడే ఉందని ఆయన అర్థం చేసుకుని 2015లో తిరిగి భారతదేశం వచ్చారు. ఏడాదిపాటు మైక్రోసాఫ్ట్ లోనే పని చేశారు.

ఆ తర్వాత ఆయన వ్యవసాయం పై పరిశోధన చేశారు. తమ పూర్వీకులు నుండి కూడా వ్యవసాయం చేస్తున్నారని మా తండ్రి తప్పించి మిగిలిన వారందరూ వ్యవసాయం చేసే వారిని చెప్పారు. కొన్ని ఎకరాల పొలం ఉత్తరప్రదేశ్లో ఆయనకి ఉంది. అయితే తాను అక్కడ పండించాలని అనుకున్నారు. గేరుబెర (gerbera) కల్టివేషన్ ని మొదలు పెట్టారు. ఇప్పుడు అయిన రోజుకి రెండు వేల పూలను అమ్ముతున్నారు.

నెలకి ఒకటిన్నర లక్షల పైగా వస్తుంది. పైగా 100 మంది ఊరు వాళ్లకి ఆయన ఉపాధి కల్పించారు. అయితే ముందు ఆర్గానిక్ కూరగాయలు పండించాలని అనుకున్నారు. అయితే అది సక్సెస్ అవ్వలేదు. అందుకని ఈ పూల ని సాగు చేయాలని అనుకున్నారు. చాలా రంగుల పూలను సాగు చేస్తున్నారు. అయితే ఈ పూలను కోసిన తర్వాత వేసవిలో అయితే నాలుగు రోజులూ చలికాలంలో అయితే పది రోజుల పాటు ఉంటాయి.

చల్లటి ప్రదేశం ఉన్న వాతావరణం వీటిని పండించేందుకు అనుకూలం. ఈయన ఒక పువ్వుని నాలుగు రూపాయలకు అమ్ముతున్నారు. పెళ్లిళ్ల సీజన్లో అయితే డిమాండ్ బాగా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఏకంగా 18 లక్షలు సంవత్సరానికి సంప్రదిస్తున్నట్లు చెప్పారు. ఎరుపు రంగు పూలు, పసుపు రంగు పూలు, గులాబీ రంగు పూలు ఇలా చాలా ఉన్నాయని తెలిపారు. వారణాసి నుండి ఈయన ఢిల్లీ, పూణే, బెంగళూరు వంటి చోట్లకు అమ్ముతున్నారు నిజానికి వ్యవసాయం చేసే వాళ్ళకి ఈయన ఆదర్శం. నెగిటివ్ ఆలోచనలు పెట్టుకుని అనవసరంగా సాగు చేయడం మానేయద్దు. ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తే కచ్చితంగా సక్సెస్ అవుతారు.

 

Read more RELATED
Recommended to you

Latest news