కేసీఆర్ కు భయం పట్టుకుంది… దుబ్బాక, హుజూరాబాద్ తర్వాత భయం మొదలైంది- మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి

-

దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ కు భయం పట్టుకుందని.. అందుకే ఈ మంత్రి పై హత్యాయత్నం అంటూ కొత్త డ్రామాకు తెరలేపారని ఆరోపించారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. స్టీఫెన్ రవీంద్ర స్క్రీప్టులో నిజం లేదని.. అందుకే బీజేపీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. పాలమూరులో అడిగితే జితేందర్ రెడ్డి అంటే ఏమిటో చెబుతారని అన్నారు. మంత్రి హత్యకు సంబంధించి సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. సీబీఐ మీద నమ్మకం లేకుంటే… జ్యుడిషియల్ ఎక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంటే… లీడర్లపై కక్ష తీర్చుకునేందుకు ఇలాంటి ప్లాన్లు చేస్తున్నారని విమర్శించారు. దుండగులను పంపి నా ఇంటిపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ అరెస్ట్ లు, మర్డర్లు ఏంటని.. ప్రశ్నించారు. మహబూబ్ నగర్ నుంచి వచ్చిన ఏ కార్యకర్త అయినా.. మా ఇంట్లో ఆశ్రయం తీసుకునే వారని తెలిపారు. మున్నూర్ రవి అనే వ్యక్తిపై ఎలాంటి ఆరోపణలు లేవని ఆయన అన్నారు. ఆయనతో పాటు ఎవరు వచ్చార్ నాకు తెలియదని జితేందర్ రెడ్డి అన్నారు. నా డ్రైవర్ ఏం తప్పు చేశారని ప్రశ్నించారు. అసలు ఎందుకు మర్డర్ ప్లానింగ్ చేయాల్సి వచ్చింది.. ఫస్ట వాటిని బయటకు తీయండని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news