Womens Day : రాష్ట్రంలో మూడు రోజుల పాటు ”మ‌హిళా బంధు కేసీఆర్” వేడుక‌లు

-

తెలంగాణ రాష్ట్రంలో అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని.. మ‌హిళా బంధు కేసీఆర్ అనే పేరుతో మూడు రోజుల పాటు నిర్వ‌హించాల‌ని టీఆర్ఎస్ పార్టీ నిర్ణ‌యించింది. కాగ ఈ నెల 8 వ తేదిన అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం వ‌స్తున్న నేప‌థ్యంలో ఈ నెల ఆరో తేదీ నుంచే.. మ‌హిళా బంధు కేసీఆర్ అనే పేరుతో వేడుక‌లు నిర్వ‌హించాల‌ని టీఆర్ఎస్ పార్టీ పిలుపు నిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంబురాల‌ను పెద్ద ఎత్తున నిర్వ‌హించాల‌ని టీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లకు సూచించారు. అంతే కాకుండా ఈ మూడు రోజుల్లో ప్ర‌త్యేక కార్యాక్ర‌మాలను సైతం నిర్వ‌హించాల‌ని తెలిపారు.

కాగ మ‌హిళా బంధు కేసీఆర్ సంబురాల నిర్వ‌హ‌న కోసం గురువారం రాత్రి టీఆర్ఎస్ రాష్ట్ర వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మంత్రులు, ప‌లువురు ఎమ్మెల్యేలు, అన్ని జిల్లాల అధ్య‌క్షుల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల గురించి దిశా నిర్ధేశం చేశారు. కాగ దేశంలో ఆడ‌ప‌డ‌చుల‌కు అండ‌గా ఉంట‌న్న ప్ర‌భుత్వం టీఆర్ఎస్ ప్ర‌భుత్వమే అని అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌ళ్యాణ లక్ష్మి, షాది ముబార‌క్ వంటి ప‌థ‌కాల‌తో 10 ల‌క్షల 30 వేలకు పైగా మ‌హిళాల‌కు రూ. 9,022 కోట్ల‌ను అందించామ‌ని తెలిపారు. మ‌హిళ‌ల కోసం ఇంత పెద్ద మొత్తంలో దేశంలో ఏ ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేయాలేద‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news