suriya : ఆ విషయంలో నాకు చిరంజీవి ప్రేరణ అంటున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య

-

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా మూవీ ఈటీ( ఎవరికి తలవంచడు) . తాజాగా ఈసినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గురువారం హైదరాబాద్ లో నిర్వహించారు. దగ్గుబాటి రాణా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాణాతో పాటు దగ్గుబాటి సురేశ్​, ‘దిల్​’రాజు, బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని వంటి వారు అతిథులుగా వచ్చారు. ఈ వేడుకలో పాల్గొన్న హీరో సూర్య మాట్లాడుతూ… నాకు సామాజిక సేవాకార్యక్రమాల్లో మెగాస్టార్ చిరంజీవే ప్రేరణ అన్నారు.  చిరంజీవి ప్రేరణతోనే ఫౌండేషన్​ మొదలు పెట్టి సామాజిక కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. కరోనా తరువాత తెలుగు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినీ పరిశ్రమను ఆదుకున్నారని అన్నారు.

‘ ఈటీ’ సినిమాలో సూర్యకు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. ఆకాశం నీహద్దురా, జైభీమ్ వరస హిట్ల తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈటీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం సూర్య తెలుగు డబ్బింగ్ చెప్పారు. పాండి రాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా… ఇమాన్ మ్యూజిక్ అందించారు. మార్చి 10న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news