టెస్ట్ క్రికెట్ లో చరిత్ర సృష్టించిన అశ్విన్.. కపిల్ దేవ్ రికార్డు బ్రేక్

-

టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేశాడు. టెస్ట్ మ్యాచ్ లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా రెండవ బౌలర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు అశ్విని. కేవలం 85 టెస్టులోనే 435 వికెట్లు పడగొట్టి ఈ చరిత్ర సృష్టించాడు అశ్విన్. అంతేకాదు 435 వికెట్లు తీసిన అశ్విన్… 434 వికెట్లు తీసిన కపిల్ దేవ్  రికార్డును బ్రేక్ చేశాడు.

ఇక ఈ లిస్టులో అనిల్ కుంబ్లే టాప్ పొజిషన్ లో ఉన్నాడు. అనిల్ కుంబ్లే 132 టెస్టుల్లో ఏకంగా 619 వికెట్లు తీసి మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. కాగా ప్రస్తుతం టీమిండియా, శ్రీలంకల మధ్య మొదటి టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో 45 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు అశ్విన్. దీంతో ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు రవిచంద్రన్ అశ్విన్. ఇక ఈ అరుదైన రికార్డును సాధించిన రవిచంద్రన్ అశ్విన్ పై టీమిండియా మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news