మార్చి 29 శుక్రవారం – రోజువారి రాశిఫలాలు
మేషరాశి: ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు, కార్యభంగం, చేసేపనిలో ఇబ్బందులు,చెడువార్తా శ్రవణం.
పరిహారాలు: మల్లెపూలతో అమ్మవారికి అర్చన, ఎర్రవత్తులతో అమ్మవారి దేవాలయం/ఇంట్లో దేవుని దగ్గర దీపారాధన చేయండి.
వృషభరాశి: ప్రతికూల ఫలితాలు, అనవసర కలహాలు, వాహనాలతో జాగ్రత్త, పనుల్లో జాప్యం.
పరిహారాలు: మల్లెపూవులతో అమ్మవారిని పూజిస్తే దోషాలు పోతాయి.
మిథునరాశి: వ్యతిరేక ఫలితాలు, పనుల్లో విపరీతమైన జాప్యం, చెడువార్తా శ్రవణం, ధననష్టం.
పరిహారాలు: అమ్మవారికి అష్టోతర పూజ, తెల్లపూల మాల సమర్పణ.
కర్కాటకరాశి: అనుకూలం. సంతోషం, ఉద్యోగ లాభం, ఆకస్మికఖర్చు, శుభకార్యాలకు వెళుతారు.
పరిహారాలు: అమ్మవారి దేవాలయంలో పూజ చేయించుకోండి వీలుకాని వారు ఆరావళి కుంకుమ ధరించి బయటకు వెళ్లండి.
సింహరాశి: అనుకూల ఫలితాలు, జయం, ప్రయాణ లాభం, వస్తులాభం.
పరిహారాలు: అమ్మవారికి పండ్లు, పూలు సమర్పించండి. తల్లిదీవెనెలు తీసుకోండి.
కన్యారాశి: ప్రతికూలం, ఆటంకాలు, ధననష్టం, దేవాలయ దర్శనం.
పరిహారాలు: అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి.
తులారాశి: వ్యతిరేక ఫలితాలు, ధననష్టం, పనులు వాయిదా, అనుకోని సంఘటనలు.
పరిహారాలు: దుర్గాదేవికి కుంకుమార్చన, ఎర్రపూలతో పూజచేయండి.
వృశ్చికరాశి: ఇబ్బందులు, వ్యతిరేక ఫలితాలు, సోదరులతో అనవసర కలహాలు.
పరిహారాలు: దుర్గాదేవి దేవాయలంలో కుంకుమార్చన, చండీదీపారాధన చేయండి.
ధనస్సురాశి: అనుకూలం. కార్యజయం, ప్రయాణ లాభం, విందులు, వ్యసనాల వల్ల అనవసర ఖర్చులు.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, గోసేవ చేసుకోండి.
మకరరాశి: అనుకూలం, కార్యలాభం, బంధువుల రాక, వస్తులాభం.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, ఎర్రపూలతో అమ్మవారి అర్చన.
కుంభరాశి: అనుకూల ఫలితాలు, పనులు పూర్తి, మిత్రులతో లాభం, ధనలాభం.
పరిహారాలు: అమ్మవారికి పూలమాల సమర్పణ, వస్త్ర సమర్పణ చేయండి.
మీనరాశి: అనుకూలం, పనులు పూర్తి, ధనలాభం, వస్తులాభం.
పరిహారాలు: అమ్మవారికి వస్త్ర సమర్పణ, పూలతో అష్టోతర పూజ చేయించుకోండి.
-కేశవ