టీఎస్ సెట్-2019 నోటిఫికేషన్

-

– పీజీ ఉత్తీర్ణులు/పీజీ చేస్తున్నవారు
– అసిస్టెంట్ ప్రొఫెసర్/లెక్చరర్‌గా పనిచేయాలంటే దీనిలో తప్పనిసరిగా అర్హత సాధించాలి.

తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్)-2019 నోటిఫికేషన్ విడుదలైంది.

పరీక్ష పేరు: స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్)

దేనికోసం: అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్‌గా పనిచేయడానికి ఈ పరీక్షలో అర్హత సాధించిచాలి.

అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో పీజీ (ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంబీఏ,ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎల్‌ఎల్‌ఎం, ఎంసీఏ, ఎంటెక్ (సీఎస్‌ఈ&ఐటీ మాత్రమే) ఉత్తీర్ణత. బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు అయితే పీజీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది.

గమనిక: పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న/పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సెట్ ఫలితాలు వెలువడిన తేదీ నుంచి రెండేండ్లలోపుగా పీజీ సర్టిఫికెట్‌ను తగిని ఉత్తీర్ణత శాతంతో సమర్పిస్తే సెట్ అర్హులుగా గుర్తిస్తారు లేకుంటే వారిని అనర్హులుగా ప్రకటిస్తారు.

వయస్సు: ఎటువంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.

పరీక్ష విధానం:
– పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పరీక్ష బహుళైచ్ఛిక (ఆబ్జెక్టివ్) విధానంలో ఉంటుంది.
– పరీక్ష కాలవ్యవధి మూడు గంటలు.
– కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (ఆన్‌లైన్) విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.

పేపర్ -I:
– 50 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకు రెండుమార్కులు. మొత్తం 100 మార్కులు. అన్ని ప్రశ్నలకు తప్పనిసరిగా జవాబులు రాయాలి.
– ఈ పేపర్‌లో టీచింగ్/రిసెర్చ్ ఆప్టిట్యూడ్‌ను పరీక్షిస్తారు. దీనిలో రీజినింగ్ ఎబిలిటీ, కాంప్రహెన్షన్, విభిన్నమైన ఆలోచనలు, జనరల్ అవేర్‌నెస్‌పై అభ్యర్థులను పరీక్షిస్తారు.

పేపర్-II:
– 100 ప్రశ్నలు. 200 మార్కులు. అన్ని ప్రశ్నలు తప్పనిసరిగా రాయాలి.
– ఈ పేపర్‌లో సంబంధిత సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఇస్తారు.

సెట్ నిర్వహించే సబ్జెక్టులు:
– జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్& అండ్ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం&మాస్ కమ్యూనికేషన్స్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫి, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రేరీ&ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, లింగ్విస్టిక్స్.

పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి.

ఫీజు: ఓసీలకు రూ.1,200/-, బీసీలకు రూ.1,000/-, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, ట్రాన్స్‌జెండర్‌లకు రూ.700/-

ముఖ్యతేదీలు:

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఏప్రిల్ 26
రూ.1500 అపరాధ రుసుంతో చివరితేదీ: మే 4
పరీక్ష తేదీలు: జూలై 5, 6, 8
హాల్‌టికెట్ డౌన్‌లోడింగ్: జూన్ 25 నుంచి
వెబ్‌సైట్: www.telanganaset.org

Read more RELATED
Recommended to you

Latest news